పవన్ కళ్యాణ్ హీరోగా, మెగాస్టార్ విలన్ గా మూవీ... షాక్ అవుతున్న ఫ్యాన్స్ .....??

Mari Sithara

టాలీవుడ్ దిగ్గజ నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ముఖ్యులు. ఇటీవల సైరా నరసింహారెడ్డి అనే హిస్టారికల్ మూవీ లో తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అద్భుతంగా నటించి ఫ్యాన్స్ ని మరియు ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్, అతి త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో 152వ సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీ బిజీగా ఉన్నప్పటికీ, అతి త్వరలో ఒక సినిమాలో నటించబోతున్నారు. దిల్ రాజు మరియు బోని కపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన పింక్ మూవీ రీమేక్ లో పవన్ నటించనున్నారు. 

 

అతి త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇకపోతే ఈ మెగాబ్రదర్స్ ఇద్దరికీ సంబందించిన ఒక ఆసక్తికర సంఘటనను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఒక కార్యక్రమంలో ఇటీవల పంచుకున్నారు. కొద్దిరోజుల క్రితం మమ్ముట్టి హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న మమాంగం మూవీ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ ఇటీవల హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఆ వేడుకకు ప్రత్యేకంగా విచ్చేసిన అల్లు అరవింద్, ఆ సినిమా హీరో మమ్ముట్టి గారితో కొన్నేళ్ల కిర్తం మాట్లాడిన ఒక మాటను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. ఇక విషయం ఏమిటంటే, కొన్నేళ్ల క్రితం నేను పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాను తెరకెక్కించాలని అనుకున్న సమయంలో, 

 

కథ ప్రకారం విలన్ మంచి పవర్ఫుల్ గా ఉంటె బాగుంటుందని భావించి ఆ పాత్రకు మమ్ముట్టి గారు ఎలా ఉంటారా అని కొంత ఆలోచించిన తరువాత ఆయనకు ఫోన్ చేసి, సర్ నేను పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తీయబోతున్నాను ఆ సినిమాలో విలన్ గా మీరు చేయగలరా అని అడిగానని అన్నారు. అయితే దానికి మమ్ముట్టి సమాధానం ఇస్తూ, అరవింద్ గారు, మీరు అడిగిన విషయం బాగుందని, కాకపోతే అదే సినిమాలో విలన్ గా మీరు నటించగలరా అని నాకు మాదిరిగా మీరు చిరంజీవి గారిని అడగగలరా అని ప్రశ్నించారట. మమ్ముట్టి చెప్పిన మాటతో అరవింద్ గారు ఒక్కసారిగా పకపకా నవ్వారట. కొన్నేళ్ల క్రితం జరిగిన ఆ ఘటనను మమాంగం ఫంక్షన్ వేదికగా పంచుకున్నారు అరవింద్.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: