ప్రభాస్ తో తీయవలసిన సినిమానే ఎన్టీఆర్ తో తీసాడట....!!

Mari Sithara

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం జాన్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇక బాహుబలి రెండు భాగాల సూపర్ హిట్స్ తరువాత సాహో సినిమాలో నటించిన ప్రభాస్, ఆ సినిమా ఫెయిల్ అవడంతో ప్రస్తుతం జాన్ పై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఇక ఈ విషయాలు అటుంచితే, 

 

ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి వంటి భారీ చారిత్రాత్మక సినిమాను తీసిన సురేందర్ రెడ్డి నేడు ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు. తన మొదటి సినిమాగా వచ్చిన అతనొక్కడే మంచి హిట్ సాధించిన తరువాత తనకు రెబల్ స్టార్ ప్రభాస్ నుండి పిలుపు వచ్చిందని, అలానే ఆయన కోసం ఒక పవర్ఫుల్ కథ కూడా సిద్ధం చేసాడట. ఇక కథ సిద్ధం చేసిన అనంతరం ప్రభాస్ కు కథ వినిపించాలనుకున్న సందర్భంలో ప్రభాస్ కు మరొక కమిట్మెంట్ ఉన్న కారణంగా అది కుదరలేదని, అయితే అదే సందర్భంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి పిలుపు రావడం, దానితో ప్రభాస్ కోసం రాసుకున్న కథనే చాలావరకు మార్పులు చేర్పులు చేసి, 

 

ఎన్టీఆర్ తో అశోక్ సినిమాగా తెరకెక్కించానని సురేందర్ రెడ్డి చెప్పడం జరిగిందట. ఈ విషయాన్ని ఇటీవల సురేందర్ రెడ్డి ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.  ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో అతిథి, అనంతరం రవితేజ తో కిక్ సినిమాలు తీశారు సురేందర్ రెడ్డి. ఇక అతి త్వరలో ఆయన ప్రభాస్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు కొద్దిరోజుల నుండి వార్తలు వస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతానికి తాను ఒక స్టాట్ హీరో కోసమే కథ సిద్ధం చేస్తున్నానని, అయితే అది ఎవరితో ఉంటుంది అనేది అతి త్వరలో తెలియపరుస్తానని అంటున్నారు సురేందర్ రెడ్డి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: