సాయి పల్లవి, నాగచైతన్య మూవీ టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్....!!

Mari Sithara

క్లాస్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించిన దర్శకుడు శేఖర్ కమ్ముల. తొలి సినిమా డాలర్ డ్రీమ్స్ నుండి మొన్నటి ఫిదా వరకు ఆయన తీసిన సినిమాల్లో చాలావరకు సినిమాలు మంచి క్లాస్ మరియు ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్నవే. ఇక తన సినిమాల్లో పెద్దగా గొడవలు, ఫైట్స్ వంటివి లేకుండా మన చుట్టూ ఉండే పాత్రలతో అలా సరదాగా సినిమాను ముందుకు తీసుకెళ్లడంతో శేఖర్ కమ్ముల మంచి దిట్ట అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న తాజా సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ ని ఖరారు చేయడంతో పాటు సినిమాను ఏప్రిల్ 2న రాబోయే వేసవి సమయంలో రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 

 

అక్కినేని నాగచైతన్య మరియు సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య లుక్ కు సంబందించిన పరిచయ టీజర్ ని ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఆకట్టుకునే మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ తో శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ నిర్మాణంలో తెరక్కేకుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తి అయినట్లు సమాచారం. ప్రస్తుతం నాగ చైతన్య, అటు వెంకీ మామ తోపాటు ఇటు ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారట. 

 

ఫస్ట్ టైం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆయన చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాధించాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక మరోవైపు ఇటీవల తన ఫిదా లో అదిరిపోయే నటనను కనబరిచి ప్రేక్షకులను ఆకట్టున్న సాయి పల్లవినే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా శేఖర్ కమ్ముల ఎంచుకోవడంతో, సినిమా తప్పకుండా సినిమా మంచి సక్సెస్ సాధించి తీరుతుందని సినిమా యూనిట్ కూడా నమ్మకంగా ఉందట. మరి ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే వచ్చే వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: