చిరంజీవికి సైరా చేయొద్దని అప్పుడే చెప్పా.. కానీ చివరికి... గిరిబాబు సంచలన వ్యాఖ్యలు

praveen

సైరా నరసింహారెడ్డి... మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోనే మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలి తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మొదటి షో నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కానీ భారీ బడ్జెట్ తో విడుదలైన ఈ చిత్రం వసూళ్లను  మాత్రం ఆ స్థాయిలో రాబట్టలేకపోయింది. టాక్ పరంగా బాగానే ఉన్నా వసూళ్ళ పరంగా మాత్రం వెనుకబడి పోయింది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో మినహా మిగతా చోట్ల మాత్రం బ్రేక్ ఈవెన్ దాటలేకపోయినది  సైరా నరసింహారెడ్డి. ఇక అటు తమిళ హిందీ భాషల్లో అయితే సైరా నరసింహారెడ్డి సినిమాకు కనీస వసూళ్లు  కూడా రాలేకపోయాయి. 

 

 

 

 దీంతో సైరా నరసింహారెడ్డి సినిమా పాజిటివ్ టాక్ తో మొదలు పెట్టినప్పటికీ చివరికి నష్టాల్లోనే ముగింపు పలకాల్సి వచ్చింది. ఈ సినిమాలో తన నటనకు ప్రశంసలందుకున్న చిరంజీవికి సైరా నరసింహారెడ్డి తో కాస్త ఉపశమనం లభించిన నిర్మాతలకు మాత్రం కాస్త నిరాశే మిగిలిందని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా  నటుడు గిరిబాబు సైరా నరసింహారెడ్డి సినిమాకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ  యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ తనకు చిరంజీవితో మధ్య అనుబంధం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఫంక్షన్ లో చిరంజీవి ని కలిస్తే మాటల సందర్భంలో ఆయన సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నట్లు తనతో చెప్పారని గుర్తు చేశారు గిరిబాబు.అప్పుడే  చిరంజీవితో చెప్పానని ఇలాంటి సినిమాను ఎందుకు ఎంచుకున్నారు అంటూ ప్రశ్నించాను  అంటూ గిరిబాబు తెలిపారు.

 

 

 సైరా నరసింహరెడ్డి సినిమా కు బదులు ఏదైనా సోషల్ సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు కదా అని చిరంజీవితో అన్నానని... అప్పుడు చరిత్రని ఇప్పుడు తీస్తే ఇప్పుడు జనరేషన్ ఎవరు చూస్తారు అంటూ చిరంజీవి తో అన్నానని  గిరిబాబు తెలిపారు. బాహుబలి లాంటి సినిమాలు చేస్తే చూస్తారు కానీ ఇప్పటి జనరేషన్ కు  ఇలాంటి స్టోరీ  అంతగా ఎక్కదని  చిరంజీవికి అప్పుడే చెప్పానని  తెలిపారు గిరిబాబు . అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ వంటి సినిమాల టైం వాళ్ళకి స్వాతంత్రోద్యమం నాటి సంగతులు తెలుసు కాబట్టి అలాంటి  సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారని...  అందుకే సైరా సినిమాపై  ఇప్పటి జనరేషన్   అంతగా ఆసక్తి చూప లేకపోయారు అంటూ గిరిబాబు అన్నారు. కాగా ప్రస్తుతం గిరిబాబు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత ప్రస్తుతం సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమాలో నటిస్తున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా... ఇక ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: