అతని వల్లే జబర్దస్త్ హిట్ అయింది : నాగబాబు

praveen

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను  అందరినీ ఎంతగానో అలరించిన జబర్దస్త్ షో ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జబర్దస్త్ షో  ప్రారంభమైనప్పటినుంచి   జబర్దస్త్ జడ్జ్ గా  కొనసాగుతున్న మెగా  బ్రదర్ నాగబాబు జబర్దస్త్ నుండి తప్పుకోవటం తో పాటు...  ఇంకొంతమంది టీం లీడర్స్  కూడా జబర్దస్త్ నుంచి తప్పుకొని జీ తెలుగు లో ప్రసారమయ్యే లోకల్గ్యాంగ్  లో ప్రత్యక్షం అవడంతో... ప్రస్తుతం వీరందరి ప్లేస్ లో ఎవరు రాబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా కొత్తగా  వచ్చిన వారు వెళ్ళిపోయినా వారి  రేంజ్లో అలరించగలరా  లేదా అన్నది కూడా ప్రస్తుతం ప్రేక్షకుల్లో తలెత్తిన ప్రశ్న . అయితే జబర్దస్త్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు జడ్జీ గా తప్పుకున్నప్పటికీ జబర్దస్త్ షో లో ఆయన అనుభవాలు అభిప్రాయాలు మాత్రం అభిమానులతో  పంచుకుంటూనే  ఉన్నారు.

 

 

 

 దీనికి సంబంధించి తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు మెగా బ్రదర్ నాగబాబు. తాజాగా మరోసారి జబర్దస్త్ గురించి తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోను విడుదల చేసిన మెగా బ్రదర్ నాగబాబు... జబర్దస్త్ షో సక్సెస్ కావడానికి కీలకపాత్ర వహించిన కొంతమంది గురించి తెలిపారు. జబర్దస్త్ షో కి ఎక్కువగా ప్రాణం పెట్టి పని చేసేది ఆర్ట్ డైరెక్టర్ రమేష్ అని చెప్పుకొచ్చారు మెగా బ్రదర్. తమకు ఎలాంటి సెట్ కావాలన్నా అప్పటికప్పుడు తక్కువ సమయంలోనే అలాంటి సెట్ డిజైన్ చేసి ఇచ్చేవారని  నాగబాబు తెలిపారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసి చూపించే వాడిని... అతని పనితనం ది బెస్ట్ అంటూ నాగబాబు ప్రశంసించారు. అలాగే జబర్దస్త్  దర్శకుల  గురించి కూడా ఈ సందర్భంగా నాగబాబు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. జబర్దస్త్ మొదట్లో షో కి దర్శకుడిగా ఉన్న  సంజీవ్ ఆ తర్వాత వచ్చిన నితిన్ భరతులు సక్సెస్ కావడానికి ప్రధాన కారణం అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు. వీరందరి వల్లే ఎప్పుడో  25 ఎపిసోడ్ల దగ్గర ఆగి పోవాల్సిన జబర్దస్త్ కాస్త ఏడేళ్లుగా టాప్ రేటింగ్ తో  ఎంతో విజయవంతంగా దూసుకువవుతుందని  తెలిపారు.

 

 

 ఈ సందర్భంగా రచ్చ రవి ఆక్సిడెంట్ గురించి కూడా ప్రస్తావించారు మెగా బ్రదర్ నాగబాబు. రచ్చ రవికి  ఆక్సిడెంట్ అయిన సమయంలో జబర్దస్త్ టీమ్ అంతా  ఆర్థిక సాయం అందించినది అని  ఆయన గుర్తు చేశారు. ఇదిలా ఉండగా నాగబాబు ప్లేస్లో జబర్దస్త్ లో జడ్జ్  గా ఎవరు రాబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెగా బ్రదర్ నాగబాబు రేంజ్ ఉన్న  జడ్జ్ ను  పెట్టేందుకు మల్లెమాల యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మెగా  రేంజ్  ఉన్న నాగబాబు ప్లేస్  లో ఎవరిని తీసుకురాబోతున్నారు అనేది కూడా ఆసక్తి నెలకొంది. కాగా  ఈ లిస్టులో చాలా మంది పేర్లు ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: