పవన్ కళ్యాణ్ తో సైరా సినిమా డైరెక్టర్..?

KSK

ఇటీవల గాంధీజీ జయంతి నాడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా విడుదల అయ్యి టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులను సృష్టించిన విషయం అందరికీ తెలిసినదే. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్నారు. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం సినిమా ప్రేక్షకులను మాత్రమే కాకుండా రాజకీయ నాయకులను సైతం అదేవిధంగా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రముఖులు సైతం ప్రభావితం చేసిన సినిమాగా సినిమాకి వచ్చిన ఆదరణ బట్టి తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ కి మంచి లాభాలు తీసుకొచ్చింది.

 

ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్ లో ఓ ఆసక్తికర ప్రచారం మొదలైంది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ చిత్ర రీమేక్ లో పవన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు దిల్ రాజు, బోనీ కపూర్ సిద్ధంగా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా సైరా సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి పవన్ తో కలిసినట్లు వీరిద్దరితో పాటు దిల్ రాజు కూడా పవన్ తో భేటీ అయినట్లు తాజాగా ఫిల్మ్ నగర్ లో వార్తలు వినపడుతున్నాయి. దీంతో సురేందర్ రెడ్డి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మరోపక్క పవన్ కళ్యాణ్ సినిమాలో రీ ఎంట్రీ విషయంలో అనేక వార్తలు వస్తున్నా వాటిని కొట్టిపారేసిన పవన్ తాజాగా ఈ వార్తపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: