రాధిక ఆప్టే లా తెలుగమ్మాయి న్యూడ్ గా నటిస్తుందా..?

Kunchala Govind
తెలుగమ్మాయి ఇషా రెబ్బా డ్యాషింగ్ యాటిట్యూడ్ గురించి అందరికి తెలిసిందే. ఈ వరంగల్ బ్యూటీలో మల్లూ భామలు.. ముంబై బ్యూటీస్ తో పోటీపడేంతటి అందం, అభినయం, ప్రతిభ ఉన్నా.. ఎందుకనో ఆశించినంతగా కెరీర్ ని మలుచుకోలేక చతికిలబడుతోంది. తెలుగమ్మాయిలు అంటే మన దర్శకనిర్మాతల ఆలోచన ఎలా ఉంటుందో ఇంతకుముందు కాస్తంత ఘాటుగానే స్పందించింది. అయితే ఇప్పుడు తనలోనూ కాస్తంత రియలైజేషన్ కనిపిస్తోంది. పట్టు విడుపు అన్న భావనపై సీరియస్ గానే ఆలోచిస్తోందట. అందుకే ఈ మధ్య హాట్ ఫొటో షూట్స్ తో కాస్త గ్లామర్స్ గా కనిపిస్తూ చెలరేగిపోతోంది. 

రాగల 24 గంటల్లో అంటూ జనాలకి వేడి పుట్టించే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఇషా రెబ్బా ఆ తర్వాత ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయిన బోల్డ్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ లో ఇషా రెబ్బా ఓ స్టోరీని ప్లే చేయబోతోందిట. తన లుక్ చాలా బోల్డ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక తెలుగు లస్ట్ స్టోరీస్ లో అమలా పాల్ ఓ స్టోరీని ప్లే చేసేందుకు ఎంపికైన సంగతి కూడా తెలిసిందే. మరి ఇషా ఎలాంటి రోల్ ప్లే చేయబోతోంది? అన్నది డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో చూసి తెలుసుకోవాల్సిందేనేమో?  

తాజా సమాచారం ప్రకారం ఇషా కొన్ని హాట్ సీన్స్ లో నటించబోతోందట. ఒకవేళ ఇదే నిజమైతే తన మైండ్ సెట్ ఇంకాస్త ఓపెన్ అయినట్టే. అవసరం ఉన్నంత గ్లామర్ ఎలివేషన్ లేకపోతే స్టార్ డమ్ అన్నది దరిదాపుల్లోకి రాదు. మరి ఈ విషయంలో పట్టు విడుపు చూపిస్తోందేమో! ముంబై బ్యూటీ కియరా అద్వానీ.. రాధిక ఆప్టే తరహాలో కాస్తంత బోల్డ్ యాటిట్యూడ్ ని అలవాటు చేసుకుంటుందనే అభిమానులు భావిస్తున్నారు. ఇంకొందరేమో రాధికా ఆప్టే లా పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటిస్తుందేమోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే అంత ధైర్యం మన తెలుగమ్మాయికి లేదులే అంటు మరో టాక్ కూడా వినిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: