ప్రభాస్ డేరింగ్ నిర్ణయంతో భయపడిపోతున్నారట....!!

Mari Sithara
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం యువ దర్శకుడు మరియు ఇటీవల గోపీచంద్ మరియు రాశిఖన్నాల కలయికలో తెరకెక్కిన జిల్ మూవీని తీసిన రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో ఒక రెట్రో ప్రేమకథగా తెరెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా, ఈ సినిమాను ఎంతో భారీ ఖర్చుతో యువి క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇటీవల సాహో మూవీ ఎంతో సక్సెస్ అవుతుందని భావించిన ప్రభాస్ కు ఆ సినిమా పెద్ద షాక్ ని ఇచ్చింది. అయితే నార్త్ లో బాగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా, తెలుగులో చాలవరకు నిరాశపరిచింది. ఇకపోతే ప్రస్తుతం నటిస్తున్న జాన్ తో పాటు, 

మరికొద్దిరోజుల్లో తన తదుపరి సినిమాను ప్రభాస్ అనౌన్స్ చేయనున్నారట. అయితే అది మరి ఎవరితోనో కాదు, ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి వంటి చారిత్రాత్మక సినిమాను తీసి, యావరేజ్ విజయాన్ని అందుకున్న సురేందర్ రెడ్డితో. ఇటీవల కొద్దిరోజుల క్రితం తన వద్ద నున్న కథతో సురేందర్ రెడ్డి, ప్రభాస్ ని కలసి ఆ కథ వినిపించడం, అయితే కథ ఎంతో ఎగ్జైట్ చేయడంతో ప్రభాస్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగినట్లు కొద్దిరోజులుగా ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్త నిజమేనని, అతి త్వరలో ఆ సినిమా విషయమై అధికారిక ప్రకటన కూడా రాబోతోందని ప్రభాస్ సన్నిహితులు కూడా కన్ఫర్మ్ చేసినట్లు టాక్. అదివరకు వరుస ఫ్లాప్స్ లో ఉన్న సురేందర్ రెడ్డి, 

ఇటీవల సైరాతో కూడా పూర్తి స్థాయి విజయాన్ని అందుకోలేదని, మరి అటువంటి దర్శకుడితో చేయడానికి ప్రభాస్ సిద్ధమయ్యారు అంటే, అది నిజంగా డేరింగ్ స్టెప్ అని కొందరు అంటున్నారు. అయితే ఈ సినిమా విషయమై ఆయన ఫ్యాన్స్ మాత్రం కొంత భయపడుతున్నారట. ఇప్పటికే సుజీత్ ద్వారా తగిలిన సాహో దెబ్బ తాము ఇంకా మరిచిపోలేదని, కాగా ఈ విధంగా ప్రభాస్ మరొక డేరింగ్ స్టెప్ వేయడంతో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అని ఆందోళన చెందుతున్నారట. మరి ప్రభాస్ నిజంగా సురేందర్ రెడ్డితో సినిమా చేస్తారో లేదో తెలియాలంటే దీనిపై ఒక అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: