ఎట్టకేలకు విడుదలవుతున్న అర్జున్ సురవరం

కిరాక్ పార్టీ తరువాత యంగ్ హీరో  నిఖిల్ నటించిన  చిత్రం అర్జున్ సురవరం. ఎప్పుడో విడుదలకావల్సిన ఈ చిత్రం  వాయిదాల మీద వాయిదా  పడకుండా  వచ్చింది. దాంతో   ఈ సినిమా  ఇక రిలీజ్ కాదేమోనని నిఖిల్ అభిమానులు  బయపడ్డారు. కానీ  ఎట్టకేలకు  ఈ సినిమా  విడుదలకు ముహూర్తం కుదిరింది.  నవంబర్ 29న ఈ చిత్రం  విడుదలకానుందని మేకర్స్ కొద్దీ సేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. 



కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ  'కనితన్' కి  రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో  నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటించగా  సామ్ సి ఎస్ సంగీతం అందించాడు. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన  టియెన్ సంతోషే ఈ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయగా  రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్  సంయుక్తంగా  నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ సినిమా విడుదల హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్  సూపర్ రెస్పాన్స్ ను  తెచ్చుకుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో  నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు. 



ఇక నిఖిల్ ప్రస్తుతం  చందూ మొండేటి  డైరెక్షన్ లో  సూపర్ హిట్  సస్పెన్స్ థ్రిల్లర్  'కార్తికేయ'  సీక్వెల్ లో  నటిస్తున్నాడు.   ఫస్ట్ పార్ట్ లో నటించిన నటీనటులు అందరూ ఈ సీక్వెల్  లో కూడా  కనిపించనున్నారు.  వీరితోపాటు గా మరో హీరోయిన్ ను  తీసుకోనున్నారు.  అయితే  ఈ సీక్వెల్ కు కార్తికేయ 2 అనే టైటిల్ కాకుండా వేరే టైటిల్ నుపెట్టాలని భావిస్తున్నారట మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ , వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: