పన్నులన్నీ సక్రమంగా కడతన్నారా? లేదా అని .. చెకింగ్ అంట.

Sirini Sita
ప్రస్తుతం హైదరాబాద్‌లో అతిపెద్ద, లగ్జరీ మల్టీప్లెక్స్ ఏ.ఎం.బి సినిమాస్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏ.ఎం.బి సినిమాస్ మొదలు పెట్టారు ఏషియన్ సినిమా సంస్ద. ఇప్పటికీ వాళ్లు అందులో భాగస్వాములుగా ఉన్నారు. దాంతో పాటు ఇతర బిజినెస్ కూడా చేస్తున్నారు. అవన్నీ కాకుండా నైజాంలో విడుదలయ్యే ప్రతీ భారీ సినిమాను కూడా డిస్ట్రిబ్యూషన్ హక్కులను దాదాపు దక్కించుకునేది ఏషియన్ సినిమాసే.ఏషియన్ సినిమాస్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లో కూడా ఉంది.

త్వరలో హీరో అల్లు అర్జున్‌తో కలిసి మరో మల్టీ‌ప్లెక్స్ నిర్మాణానికి కూడా ఏషియన్ సినిమాస్ సిద్ధపడుతోంది ఇక తెలంగాణలో వీళ్లకు చాలా వరకు ఎషియన్ సినిమాస్ పేరిట థియేటర్స్ ఉన్నాయి. అంతే కాదు దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు అనేక మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి.
తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూషన్ సంస్దగా పేరున్న ఏషియన్ సినిమాస్ కార్యలయాలపై ఐటి దాడులు జరిగాయి. వరసగా జరిగిన ఈ సోదాలతో నిర్మాతలు కూడా షాక్ అయ్యారు. గతంలో కూడా ఏషియన్ ఫిల్మ్స్ సంస్థలపై ఐటి దాడులు జరిగాయి. ఇక ఇప్పుడు మరోసారి ఇదే సీన్ రిపీట్ అయింది.

ఏషియన్ సినిమా అధినేతలు నారయణదాస్, సునీల్ నారంగ్ ఇళ్లతో పాటు వారి సన్నహితుల నివాసాలలో కూడా వరసగా ఐటి సోదాలు జరిగాయి.   అయితే, ఐటీ అధికారులు సోదాల్లో ఏం బయటపడ్డాయి అనే విషయంలో ఇంకా స్పష్టతలేదు. పెద్దమొత్తంలో డబ్బు కాకుండా కొన్ని  కీలక పత్రాలు దొరికినట్టు సమాచారం.  ఉన్నట్లుండి జరిగిన ఈ దాడితో మిగిలిన నిర్మాతల గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి. 


ప్రస్తుతం నాగచైతన్య హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కతోన్న సినిమాను సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ యజమానులు ప్రభుత్వానికి పన్నులన్నీ సక్రమంగా చెల్లించారా లేదా అనే అంశంపై అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. అందుకే వీళ్లపై ఐటి సోదాలు జరిగాయని అంటున్నారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: