జబర్దస్త్‌ లో రెమ్యునరేషన్ల బాధలు

Sirini Sita
జబర్దస్త్.. ప్రస్తుతం ఉభయ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ షో. మెగా బ్రదర్ నాగబాబు, వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షోలో యాంకర్లు అనసూయ, రష్మీ గౌతమ్ తమ అంద చందాలు ప్రదర్శిస్తూ కుర్ర ప్రేక్షకుల గుండెలను కొల్లగొడుతున్నారు. ఇక ఆర్టిస్టుల విషయానికి వచ్చేసరికి చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, సునామీ సుధాకర్, భాస్కర్, అదిరే అభి, రాకెట్ రాఘవ, రచ్చ రవి ఇలా కామెడీ టీంలు చేసే కామెడీ, పూయించే నవ్వులు ప్రత్యేకంగా చేప్పాలిసిన అవసరం లేదు. ఈ షో చూస్తున్నంత సేపు నవ్వులు ఆపుకోవడం కష్టం అంటే అతిశయోక్తి కాదు. 


ఇంతక ముందు కాస్త వల్గారిటీ ఎక్కువైనా, ఆ తర్వాత చాలా వరకు తగ్గించేశారు. అంతా ఒక్క పక్కన ఉంటే ఇంకో సైడ్ మాత్రం జబర్దస్త్‌ లో రెమ్యునరేషన్, బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుల పేమెంట్లపై ఓ వివాదం బాగానే నడుస్తూనే ఉంది. ముఖ్యంగా టీం సభ్యుల్లో కొందరికే పేమెంట్లు ఇస్తారని, మిగతా వారికి అవేమీ ఉండవని ఓ కాంట్రవర్సీ కూడా జరిగింది. దానిపై పలువురు ఆర్టిస్టులు వివరణ కూడా ఇచ్చారు అనుకోండి. షోను నిర్వహిస్తున్న మల్లెమాల ప్రొడక్షన్స్ పేమెంట్లు, రెమ్యునరేషన్ సరిగ్గానే ఇస్తున్నా టీం లీడర్లు మాత్రం తమకు నచ్చిన వారికి మాత్రమే డబ్బులు ఇస్తారని, మిగతావారిని పట్టించుకోరని వెల్లడించారు ఈ జూనియర్ ఆర్టిస్టులు.


అయితే, ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలో తాజాగా హైపర్ ఆది పేమెంట్ల విషయంపై పంచ్‌లు గట్టిగా వేశాడు. చాలా సందర్భాల్లో ఏదైనా అంశాన్ని లేవనెత్తేందుకు స్కిట్‌ను వేదికగా చేసుకొని విమర్శలు గానీ, ప్రశంసలు గానీ చేయడంలో ఆది సుప్రసిద్ధుడు. తాజాగా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జబర్దస్త్ స్కిట్‌ లోనూ హైపర్ ఆది పేమెంట్ విషయంపై పంచ్ వేశాడు. సైరా గెటప్‌లో ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది బ్యాగ్రౌండ్ ఆర్టిస్టులను పొగిడి పైకి ఎత్తాడు. అయితే, వాళ్లు పేమెంట్ అడిగే సరికి గెట్ అవుట్ ఫ్రమ్ మై జబర్దస్త్ అని అంటాడు. అదేంటని అడిగితే ‘మేం వెళ్లి పేమెంట్ గురించి అడిగితే వాళ్లు కూడా ఇదే అంటున్నారు’ అని కాస్త వెరైటీగా మాట్లాడాడు. దీనికి అక్కడున్న నాగబాబు, రోజా కొంత షాక్ అయ్యారు అనేది వాస్తవం.


అక్కడే ఉన్న అనసూయ కూడా "వామ్మో ఆది ఇలా అంటున్నాడేంటి?" అన్నట్లు ముఖ కవళికలు పెట్టడం విడ్డురం. ఆ తర్వాత కూడా ఆర్టిస్టుల పేమెంట్ల గురించి కూడా వ్యాఖ్యానించాడు. గతంలోనూ చాలా సందర్భాల్లో రెమ్యునరేషన్, పేమెంట్ల గురించి హైపర్ ఆది తనదైన శైలిలో పంచ్‌లు బాగేనే వేశేవాడు. ప్రస్తుతం దీనిపై జోరుగా చర్చ నడుస్తోంది. కామెడీ కోసమే పేమెంట్లపై హైపర్ ఆది పంచ్ వేశాడని అనుకున్నా ‘నిప్పు లేనిదే పొగ రాదు’ అంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: