ఆర్ఆర్ఆర్ కథలో మార్పులు... రిలీజ్ డేట్ వాయిదా..?

Reddy P Rajasekhar
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై ఈ మధ్య కాలంలో గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. రెండు వారాల క్రితం విడుదలైన చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా టాలీవుడ్ లో హిట్ అనిపించుకుంది. కానీ బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ లలో ఈ సినిమా కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిన ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఇతర భాషల ప్రజలకు పరిచయం లేకపోవటం వలనే అక్కడ ఫ్లాప్ అయిందనే వాదన వినిపిస్తోంది. 
 
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలతోనే తెరకెక్కిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం గురించి ఇతర రాష్ట్రాల ప్రజలకు పరిచయం లేదు కాబట్టి రాజమౌళి ఈ సినిమా కథను మారుస్తున్నాడని రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. కానీ రాజమౌళి ఒకసారి కథ ఫైనల్ చేసిన తరువాత ఆ కథలో సాధారణంగా మార్పులు చేయడు. 
 
కాబట్టి రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కథలో మార్పులు చేస్తున్నాడనే వార్త అబద్ధం అని చెప్పవచ్చు. మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిందని 2020 దసరా లేదా 2021 సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాబోతుందని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమా షెడ్యూల్స్ దర్శకుడు అనుకున్న ప్రకారం జరగలేదనే మాట వాస్తవమేనని చెప్పవచ్చు. 
 
ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ కు గాయాలు కావటం జూనియర్ ఎన్టీయార్ కు హీరోయిన్ ను ఫైనలైజ్ చేసినప్పటికీ ఆ హీరోయిన్ తప్పుకోవటం వలన సినిమా ముందుగా అనుకున్న డేట్ కు రిలీజ్ కాకపోవచ్చని తెలుస్తోంది. రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్ కు కూడా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. గ్రాఫిక్స్ పనుల వలన కూడా ఆర్ఆర్ఆర్ సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: