దిల్ రాజు లాంటివాళ్లు చెప్పినా సైరా టీం వినలేదట..అందుకే సైరా రిజల్ట్ ఇలా ఉందా..?

Kunchala Govind
సైరా యూనిట్ ఆశలు అన్నీ శనివారం నుంచి ప్రారంభమయ్యే దసరా సీజన్ మీదనే అని అనుకున్నారు. అక్టోబర్ 2 సెలవు అని, ఓవర్ సీస్ లో మంగళవారం కాబట్టి ఆఫర్లు వస్తాయని, మాంచి ప్రీమియర్ లెక్కలు కనిపిస్తాయని అంచనా వేసారు. కానీ అక్కడే ఎంతగా నష్టం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు. ఆంధ్రలో రేట్లు అతి భయంకరంగా పెంచేసారు. నేల నుంచి బాల్కనీ వరకు ఉత్తరాంధ్రలో 300 రూపాయలు, మిగిలిన చోట్లు 200, కొన్నిచోట్ల 150 మాదిరిగా ఫిక్స్ చేసుకున్నారు. కోర్టు నుంచి కూడా ఉత్తర్వులు తెచ్చుకున్నారు.

అయితే వారంరోజుల పాటు ఇంత పెద్ద రేట్ల మీద సినిమాను నిలబెట్టడం అంత ఈజీ కాదని ఆలోచించలేకపోయారు. ఇలాంటి విషయాలలో అనుభవం ఉన్న దిల్ రాజు లాంటివాళ్లు.. ఇది రిస్క్ అని చెప్పినా అంతగా పట్టించుకోలేదని తెలుస్తోంది. దాంతో సినిమా బాగుందని టాక్ వచ్చినా, ఫ్యామిలీలు ఫ్యామిలీలు సినిమాలు వెళ్లడానికి వెనకడుగు వేస్తున్నారు. పైగా వారం మధ్యలో సినిమా విడుదల కావడం, పరీక్షలు వుండడం కూడా మైనస్ అయింది. అదీ కాక ఈ రేట్లు పెట్టి థియోటర్స్ వరకు ఎవరు వెళతారులే.. కొన్నాళ్ళాగితే ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు అనుకున్నారు. 

ఇక శనివారం నుంచి కలెక్షన్లు భారీగా వస్తాయని అంచనా వేసారు. శని, ఆది, సోమ, మంగళ, బుధ ఈ అయిదు రోజులు చాలు అని, బయ్యర్లు బయటపడతారని అనుకున్నారు. అలా అంచనా వేసిన శనివారం వచ్చింది. కానీ రోజు రోజుకు కలెక్షన్స్ కిందకు జారుతున్నట్లే, శనివారంకి కూడా కిందకే దిగిపోయాయని తెలుస్తోంది. అంతేకానీ కనీసం స్టడీగా కూడా లేవు. ఇక మిగిలిన ఆశలు ఆది, సోమ, మంగళ, బుధ వారాలు. ఆదివారం, సోమవారం ట్రెండ్ చూస్తే ఆ ఆశలు నిలబడతాయో లేదో తెలుస్తుంది. ఇప్పటికి ఓవర్ సీస్ నుంచి తెలుగునాట వరకు బయ్యర్లు సగం రికవరీ అయ్యారు. అయితే ఇలా రికవరీ అయిన దాంట్లో ఫిక్స్ డ్ హైర్ లు, అడ్వాన్స్ లు వంటివి ఉండనే వున్నాయి. ఫుల్ రన్ పూర్తి అయితే తప్ప అసలు సంగతి ఏంటనేది అర్థమవుతుంది.   మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: