క‌ష్టాలు కూడా చిరునవ్వుతో స్వీక‌రిస్తానంటున్న బాలీవుడ్ గ‌ల్లీబాయ్‌

Arshu
హిందీ నటుడు రణ్వీర్ సింగ్ యొక్క విన్నూత్నమైన ప్రవర్తన, అలవాట్ల గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ,రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్, సింబా, గల్లీ బాయ్ లాంటి ప్రజాదరణ పొందిన చిత్రాల్లో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ, తన ప్రత్యేకమైన వేషధారణ తో జనాలను ఆకట్టుకుంటూ వస్తున్నాడు రణ్వీర్. ఇన్ని విజయాలు సాధించి, ఇంత పేరు గడించినా, కొందరు రణ్వీర్ సింగ్ ని 'అతి', 'అదో రకం', 'వింత' లాంటి పదాలతో ప్రస్తావిస్తున్నారు. ఈ విషయానిపై తన స్పందనను తెలియజేస్తూ రణ్వీర్ ఇలా అన్నాడు.


"హుషారుగా ఉండేవాళ్ళని, చక్కని హాస్య చతురత కనబరిచే వాళ్ళని లోకం ఎందుకో తేలికగా తీసిపడేస్తుంది. నిజానికి నేను చాలా సీరియస్ మనిషిని, లోతైన ఆలోచనలు గల వాణ్ణి," అని రణ్వీర్ చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్నివిశ్లేషిస్తూ, "నా జీవితంలో ఎన్ని కష్టాలున్నా నేను వాటిని ఒక చిరునవ్వుతో అధిగమిస్తాను. మనం మహా కలియుగం లో బ్రతుకుతున్నాము. ఇదో చీకటి ప్రపంచము, జీవితం ఎవ్వరినీ వదలదు. అందరూ భవసాగరాలు దాటాల్సిందే. వీటి నుంచి కొంతసేపన్నా బయటపడి కొందరి జీవితాలని ఆనందమయం చేయాలనే తపనతో ఈ ఉత్సాహం కనబరుస్తూ ఉంటా," అని రణ్వీర్ సింగ్ పేర్కొన్నాడు.
"నా జోరు చూసి చాలా మంది నా నిజ జీవితంలో కూడా ఇలానే ఉంటానేమో అని అనుకుంటారు. అది నిజం కాదు. నా విభిన్న పాత్రపోషణని గమనించైనా ఈ విషయం అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నా."


బాలీవుడ్ లాంటి మహా సముద్రంలో తనదైన శైలి లో పాత్రలు ఎన్నుకుంటూ, 800 కోట్ల వసూళ్లను 12 నెలల వ్యవధిలోనే రాబట్టగలిగిన ఏకైక నటుడిగా చరిత్ర తిరగ రాసాడు రణ్వీర్ సింగ్. తన అభిమానులని ఆనంద పరచడానికి ఎంత దూరమైనా వెళ్లగలడని రుజువు చేసాడు. ఇటీవలి కాలంలోనే ఇంగ్లాండ్ లో, గర్భవతి గా ఉన్న తన మహిళా అభిమానిని కలవాలని, ఏకంగా గంటన్నరసేపు ప్రయాణం చేసి శుభాకాంక్షలు తెలిపాడు. ఒక స్టార్ గా ఉంటూ కూడా ఒదిగి ఉండగలడని నిరూపించాడు.
"నన్ను నేనెప్పుడూ ఒక స్టార్ గా ఊహించుకోలేదు. నేను ఈ స్థాయికి ఎదిగాననే నమ్మకం నాకింకా కలగటం లేదు. ప్రియాంక చోప్రా జోనస్ ఎప్పుడూ అంటూ ఉంటుంది నాతో, 'నువ్వు స్టార్ అయ్యావనే విషయాన్ని నువ్వు ఇంకా గ్రహించట్లేదు.ఈ రోజు కూడా అమ్మ చాటు బిడ్డ లాగా, అమాయకంగా నా ఫోటోలు తీస్తున్నారనే ఆనందంతో మురిసిపోయే కుర్రాడివి నువ్వు' (నవ్వుతూ)."


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: