కృష్ణ గారికి 'అల్లూరి సీతారామరాజు'లా, చిరంజీవికి 'సైరా' నిలుస్తుందా....??

Mari Sithara
టాలీవుడ్ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ హీరోనో తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలుసు. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక చిత్రాల్లో హీరోగా నటించిన కృష్ణ గారి కెరీర్లో కొన్నేళ్ల క్రితం వచ్చిన అల్లూరి సీతారామరాజు సినిమా ఎంతో అత్యద్భుత ఘన విజయాన్ని దక్కించుకుని, కృష్ణ గారి కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా కూడా ఆయన కెరీర్ లో ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోతుందా అంటే, కొన్ని అంశాల పరంగా అవునని, మరికొన్ని అంశాల పరంగా కాదని భిన్న వాదనలు వినపడుతున్నాయి. 

ఎప్పుడో 14 ఏళ్ళ క్రితం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కథను రాసుకున్న పరుచూరి సోదరులు, అప్పటినుండి మెగాస్టార్ తోనే ఈ సినిమా తీయాలని సంకల్పించారట. అయితే మధ్యలో ఎన్నో అవాంతరాలు వచ్చాయని, అలానే కొన్నేళ్ల క్రితం మెగాస్టార్ సడన్ గా రాజకీయాల్లోకి వెళ్ళడంతో ఈ సినిమా ఇకపై తెరకెక్కదు అని కూడా భావించారట. అయితే అనుకోకుండా మెగాస్టార్ గారు మళ్ళి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో తమకు ఆనందం వేసిందని, అదే ఊపులో మెగాస్టార్ గారికి ఎన్నో మార్పులు చేర్పులు చేసి సైరా స్టోరీని విన్పించి ఒప్పించారట. ఇక ఎట్టకేలకు రామ్ చరణ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించడం ఆనందంగా ఉందని పరుచూరి సోదరులు సహా యూనిట్ సభ్యులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

అయితే ఈ సినిమా నిజంగా విజయవంతం అయిందా అంటే, మెగాస్టార్ అత్యద్భుతన నటన, డైలాగ్స్, విజువల్స్, సెట్స్ వంటి అంశాల పరంగా విజయవంతం అయిందని, అయితే సినిమా కథ, కథనాల సాగతీత, నెమ్మదిగా సాగె సీన్లు, పెద్దగా ఆకట్టుకోని ఎమోషనల్ సన్నివేశాలు, అన్నిటికంటే ఇబ్బంది కలిగించేలా లెంగ్తి రన్ టైం వంటివి ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాదు అనడానికి కారణాలుగా చెప్తున్నారు. అయితే మొత్తంగా అవన్నీ కలుపుకుంటే సైరా మంచి చిత్రమే అయినప్పటికీ, ఒక యావరేజ్ చిత్రం మాత్రమేనని, అయితే ఓవర్ ఆల్ చెప్పాలంటే కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు మాదిరిగా, మెగాస్టార్ ఎంటైర్ కెరీర్ లో సైరా ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమాగా చెప్పవచ్చని అంటున్నారు.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: