కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమా టైటిల్ తోనే క్రేజ్ సంపాదించుకుంది..?

Kunchala Govind
రీసెంట్‌గా మహానటి సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ తెలుగులో తక్కువగా కనిపిస్తున్నప్పటికి తమిళంలో మాత్రం అగ్ర హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. మైదాన్ టైటిల్ తో దర్శకుడు అమిత్ శర్మ రూపొందిస్తున్న బయోపిక్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా మైదాన్ లోగో తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కీర్తి సురేష్ తన ఇన్స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంది. అయితే యాక్టర్స్ లుక్స్ ఎవరివి ఇందులో రివీల్ చేయకుండా సస్పెన్స్ ని క్రియోట్ చేశారు చిత్ర బృదం. ఇక మైదాన్ సినిమా 1950-60 దశకాల మధ్య జరిగే కథ  అని తాజా సమాచారం.

ఎంతో ఫేమస్ అయిన హైదరాబాద్ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ పాత్రను బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగన్ పోషిస్తున్నాడు. అప్పట్లో ఇండియాలో ఫుట్ బాల్ ఆటకు స్వర్ణ యుగంగా భావించే టైంలో జరిగిన నిజ జీవిత సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రికెట్ కున్న ప్రాముఖ్యత తెలియకముందు భారతదేశంలో ఫుట్ బాల్ క్రీడకు ఎంత ఆదరణ ఉండేదో ఈసినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపబోతున్నారు. ఇప్పుడీ ప్రాజెక్ట్ పట్ల కీర్తి సురేష్ చాలా ఎగ్జైటింగ్ గా ఉందట. మళ్ళీ మహానటి అంతటి క్రేజ్ ని ఈ సారీ బాలీవుడ్ లో తెచ్చుకుంటున్నట్టుగా చాలా ధీమాగా ఉంది. 

గత ఏడాది వచ్చిన బధాయీ హో తో నేషనల్ అవార్డు సంపాదించుకున్న అమిత్ శర్మ మైదాన్ స్క్రిప్ట్ మీద చాలా కాలం వర్క్ చేశాడు. అయితే కీర్తి సురేష్ పాత్ర ఏంటనే విషయం మాత్రం ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం తను టీనేజ్ నుంచి మధ్యవయస్కురాలిగా డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తుందట. ఎమోషనల్ గా చాలా డెప్త్ ఉన్న పాత్ర కావడంతో మహానటి ని చూసిన అమిత్ శర్మ మరో ఆలోచన లేకుండా కీర్తిని సంప్రదించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడీ పాత్ర ద్వారా కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో పాపులర్ అవుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: