బాలీవుడ్ కోసమే స్లిమ్ గా మారాను..కీర్తి సురేష్.

Kunchala Govind
కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే మహానటి కి ముందు..మహానటి తర్వాత అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ అంతా దర్శకుడు నాగ అశ్విన్ కే చెందుతుంది. ఎందుకంటే ఈ సినిమాతో కీర్తి స్థాయిని అంతలా పెంచేశాడు కాబట్టి. 'నేను శైలజ' సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది.  స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు సాధించింది. అయితే మహానటి మాత్రం ఒక స్థాయి అని చెప్పాలి. అందుకే కీర్తి సురేష్ కూడా 'మహానటి' తర్వాత ఎలాంటి సినిమాలలో నటించాలనే విషయంలో సందిగ్ధంలో పడిపోయింది. కొంత గ్యాప్ తర్వాత ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని సమాచారం.  


ఇక లేటెస్ట్ అప్‌డేట్ కొస్తే కీర్తి సురేష్ తన కొత్త లుక్ తో ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. మొన్నటివరకు కీర్తి కాస్త బొద్దుగా ఉంటుందనే సంగతి తెలిసిందే.  తన కెరీర్ మొదటి నుంచి కూడా కీర్తి మరీ స్లిమ్ముగా ఏమీ ఉండేది కాదు. కానీ ఈమధ్య కాస్త వెయిట్ పెరగడంతో మళ్ళీ గ్లామరస్ లుక్స్ పై ఫోకస్ పెట్టి  అతి తక్కువ సమయంలోనే  స్లిమ్ముగా మారిపోయింది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ కి పోటీ అన్నట్టుగా ఇప్పుడు జీరో సైజ్ లోకనిపిస్తోంది.  అయితే మన తెలుగు ప్రేక్షకులలో కొంతమందికి బొద్దుగా కనిపిస్తేనే ఇష్టం. కీర్తి మరీ బక్కగా ఉందని వాళ్ళు ఫీల్ అవుతారో ఏమో! 


అయితే కీర్తి ఇలా స్లిమ్ అవడానికి అసలు కారణం వేరే ఉందట. అజయ్ దేవగణ్ నటించనున్న ఒక బయోపిక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందని టాక్ ఉంది.  ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు 1953 నుండి 1963 వరకూ కోచ్ గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్ రూపొందుతోంది. 'బధాయి హో' ఫేం అమిత్ శర్మ దర్శకుడు. ఈ స్లిమ్ మేకోవర్ బాలీవుడ్ కోసమే అని ఇండస్ట్రీ టాక్. మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: