బాలీవుడ్ హీరో సరసన కీర్తి సురేష్!

siri Madhukar
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన మాలీవుడ్ నటి మేనక నట వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన నటి కీర్తి సురేష్.  మాలీవుడ్ లో నటించిన తర్వాత తెలుగు లో రామ్ హీరోగా నటించిన నేను శైలజ సినిమాలో నటించింది.  ఈ సినిమా సక్సెస్ కావడంతో నాని హీరోగా నేను లోకల్ సినిమాతో మంచి విజయం అందుకుంది.  ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’సినిమాతో  స్టార్ హీరోయిన్ గా మారింది.  ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ గా ఉన్నారు కీర్తి సురేష్.   

తన అందం, అభినయంతో అటు తెలుగు, ఇటు తమిళ ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి సురేష్.. ఇప్పుడు బాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు.  బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు అజయ్ దేవగాన్.  ప్రస్తుతం తానాజీ సినిమాలో షూటింగ్ బిజీలో ఉన్నారు.  ఈ సినిమా పూర్తయిన తర్వాత ఓ బయోపిక్ సినిమాలో నటిస్తున్నారట.

1950-63 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాలో అజయ్ దేవగాన్ సరసన కీర్తి సురేష్ నటించబోతున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి.  ఈ బయోపిక్‌కు ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ప్రముఖ మూవీ అనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: