కీర్తి సురేష్ ఇంకా మహానటి ఫీవర్ లో ఉంది .. అందుకే ..!

Prathap Kaluva

మహానటి సినిమాతో కీర్తి సురేష్ మంచి పేరు వచ్చింది. దీనితో కీర్తి సురేష్ పేరు మారు మ్రోగి పోయింది. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నది. కానీ కీర్తి మాత్రం ‘మహానటి’ హ్యాంగోవర్ బాగా ఎక్కేసిందేమో అనిపిస్తోంది తన వ్యవహారం చూస్తే. ‘మహానటి’ తర్వాత ఆమె అంత సులువుగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. తన పాత్రల్లో ఏదో ప్రత్యేకత, అధిక ప్రాధాన్యం ఉండాలని ఆశిస్తోంది. ఈ క్రమంలో ఆమె చూపులు లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఉంటున్నాయి.


‘మహానటి’ తర్వాత తెలుగులో చాలా గ్యాప్ తీసుకుని ఒక సినిమా మొదలుపెట్టింది కీర్తి. అది లేడీ ఓరియెంటెడ్ ఫిలిమే కావడం విశేషం.ఐతే తెలుగులో ఆల్రెడీ ‘మహానటి’తో గుర్తింపు వచ్చింది కాబట్టి ఇక్కడ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయడంలో అర్థముంది. కానీ బాలీవుడ్లో సైతం అలాంటి సిినిమానే చేయబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. కీర్తిని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ బాలీవుడ్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడట.


కీర్తి తల్లి మేనకకు బోనీ మంచి స్నేహితుడు. ఆయనే ఆమె కోసం మంచి కథ రెడీ చేయించాడట. ఐతే గ్లామర్ హీరోయిన్ల రాజ్యం సాగే బాలీవుడ్లో కీర్తి లాంటి ట్రెడిషనల్ హీరోయిన్ ఏమాత్రం ఉనికిని చాటుుకుంటుందో.. పైగా ఆమె నేరుగా లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తే జనాలు ఏమాత్రం రిసీవ్ చేసుకుంటారో అన్నది సందేహం. గత ఏడాది ‘బడాయి హో’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన అమిత్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: