రజినికాంత్ కు మాత్రమే ఇది సాధ్యం..!

shami
సూపర్ స్టార్ రజినికాంత్.. కేవలం ఇది ఒక పేరు కాదు స్టైల్ కు ఐకాన్. తన స్టైల్ తో బాక్సాఫీస్ రికార్డుల అంతుచూసే రజినికాంత్ దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులను ఏర్పరచుకున్నారు. కర్ణాటక నుండి వచ్చి తమిళనాడులో హీరోగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు రజినికాంత్.


రజినికాంత్ అసలు పేరు శివాజి రావు గైక్వాడ్, బాలచందర్ ఆయన పేరు రజినికాంత్ గా మార్చారు. అయితే అది హోలీ రోజు కావడం వల్ల బాల చందర్ బ్రతికి ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం హోలీ రోజున రజినికాంత్ బాల చందర్ కు ఫోన్ చేసి బాగోగులు మాట్లాడేవారట. 


నిరాడంబరమైన జీవితాన్ని గడిపే వ్యక్తి రజినికాంత్. తెర మీద స్టైల్ గా కనిపించే రజిని నిజ జీవితంలో ఎంతో సింపుల్ గా ఉంటారని తెలిసిందే. ఇంట్లో ఉంటే రజిని ఓంకార నాదం వింటుంటారు.. ఇష్టమైన దేవుడు వినాయకుడు.    


రజిని రోడ్డు పక్కన కాకా హోటల్ లో భోజనం చేస్తారు.. పోరూర్ సిగ్నల్స్ దగ్గర రెస్టారెంట్ లో భోజనం చేస్తుంటారట. మెరినా బీచ్ లో అమ్మే వేరుశనగలు అంటే రజినికి చాలా ఇష్టమని సమాచారం.  ఏ.వి.ఎం స్టూడియో షూటింగ్ జరిగితే మాత్రం రజిని 10వ నెంబర్ రూం లో భోజనం చేస్తారట. అది తనకు సెంటిమెంట్ అని తెలుస్తుంది. షూటింగ్ టైంలో ఆయనతో పాటుగా మరో పాతిక మందికి భోజనం ఏర్పాటు చేస్తారు రజినికాంత్.  


ఇంట్లో పని చేసే వారందరికి నీలాంగరైలో ఫ్లాట్ కొనిచ్చారట రజినికాంత్. అంతేకాదు వారి మీద కొంత డబ్బుని ఫిక్సెడ్ డిపాజిట్ కూడా చేశారట. తనతో పాతికేళ్ల పాటు కలిసి పనిచేసిన ఉద్యోగికి రజిని నెల నెల డబ్బులు ఇప్పటికి పంపిస్తున్నాడట. ఏ సినిమా చేసినా ఆ సినిమా చేసే సహాయకులకు కొంత మొత్తం కానుకగా ఇస్తాడట రజినికాంత్.      మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: