‘సర్కార్’కి దిమ్మతిరిగే షాక్!

siri Madhukar
తమ అభిమాన హీరో విజయ్ నటించిన ‘సర్కార్’సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది...దాంతో విజయ్ కెరీర్ లో మరో భారీ విజయం ఖాయం అంటున్నారు అభిమానులు.  మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ‘సర్కార్‌’ సినిమా ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన ఇలయ దళపతి విజయ్‌కు తమిళ సర్కార్‌ షాకిచ్చింది.

ఈ సినిమా స్పెషల్‌ షోలకు అనుమతి నిరాకరించింది.  సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే..6,7 షోలు వేస్తుంటారు..కానీ ‘సర్కార్’కి ఆ అనుమతి నిరాకరించింది తమిళ ప్రభుత్వం.  ఈ నేపథ్యంలో తమిళనాడు చలనచిత్ర పంపిణీదారుల సంఘం విజ్ఞప్తి మేరకు దీపావళి రోజుతోపాటు 7,8,9 తేదీలలో థియేటర్లలో ఒక్క స్పెషల్‌ షోకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం జీవో విడుదలైంది. 4 రెగ్యులర్‌ షోలు, ఒక స్పెషల్‌ షోతో కలిపి ఐదు షోలకు మాత్రమే వీలవుతుంది. అది కూడా నాలుగు రోజులు మాత్రమే.

ఇలా జరిగితే ‘సర్కార్’ కలెక్షన్లపై తీవ్ర పరిణామం పడుతుందని పంపిణీదారులు అంటున్నారు.  సాధారణంగా పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు స్పెషల్‌ షో పేరుతో ప్రేక్షకులకు టిక్కెట్లను అధిక ధరకు విక్రయించడమే కాకుండా తెల్లవారుజాము నుంచే షోలు ప్రారంభించడం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని ఆరోపణలు తలెత్తాయి.  దాంతో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  దీనిప్రకారం థియేటర్లలో స్పెషల్‌ షోలు ప్రదర్శించరాదని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: