హీరో విజయ్ కి ఫ్యాన్స్ అపురూపమైన బహుమతి!

Edari Rama Krishna
సాధారణంగా స్టార్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంటుంది.  తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ హీరో విజయ్ మాత్రమే ఉంది.  ఇక తమ అభిమాన హీరో చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్ సంబరాలు అంబరాలు అంటుతాయి.  థియేటర్ల వద్ద వారం ముందు నుంచే హడావుడి మొదలవుతుంది.  ఈ నేపథ్యంలో హీరో విజయ్ కి అభిమానులు కనీ వినీ ఎరుగని రీతిలో బహుమతి అందించారు.  అయితే హీరో విజయ్ కి తమిళ నాటనే కాదు టాలీవుడ్, మాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందిన చిత్రం ‘సర్కార్’ ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేరళ అభిమానులు విజయ్ కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. కొల్లం నన్బన్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు విజయ్ కోసం 175 అడుగుల భారీ కటౌట్‌ను రూపొందించి  మలయాళ నటుడు సన్నీ వెయిన్ చేత ఆవిష్కరింపజేశారు.  అంతే కాదు హీరో విజయ్ అభిమాన సంఘం పేద ప్రజలకు సహాయం అందించడానికి లక్షరూపాయల విరాళం సేకరించారు. 

ఈ చిత్రం రిలీజ్ సందర్భంగా పేద ప్రజలకు కొన్ని వస్తువులు వారు అందజేయనున్నారట.  ఇక ‘సర్కార్’ చిత్రంలో విజయ్ మొదటి సారిగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు.  ఇప్పటికే తమిళ నాట విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి రక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘సర్కార్’ చిత్రంపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. సర్కార్ చిత్రంలో కీర్తి సురేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: