రికార్డులు క్రియేట్ చేస్తున్న‘సర్కార్’ టీజర్!

siri Madhukar

తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే..ఆ రేంజ్ మాస్ ఇమేజ్ సంపాదించిన హీరో విజయ్. తమిళ నాట స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మురుగదాస్-విజయ్ కాంబినేషన్ లో ‘సర్కార్’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.  విజయదశమి కానుకగా ‘సర్కార్’ టీజర్‌తో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు ఇళయదళపతి విజయ్. పక్కా పొలిటికల్ టచ్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ఈ టీజర్ చెప్పేస్తుంది. మల్టీ మిలినియర్ అయిన విజయ్ తన ఓటును వినియోగించుకోవడానికి ఇండియాకి రావడం, ఆ తర్వాత జరిగే పరిణామాలను మురగదాస్ తనదైన స్టయిల్‌లో తెరకెక్కించారు.


 ఏఆర్ మురుగదాస్ ఒక బ్రిలియంట్ ఫిలింమేకర్. మురుగదాస్ మరోసారి ఇంట్రస్టింగ్ సబ్జెక్టుతో ఈచిత్రాన్ని తెరకెక్కించినట్లుగా టీజర్ చెప్పేస్తోంది. విజయ్ సినిమాకు ఉండాల్సిన అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కాబోతోంది.  తుపాకి, కత్తి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో మూవీ కావడంతో ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే ‘సర్కార్’ టీజర్‌ రూపొందించాడు దర్శకుడు.  యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ టీజర్లో విజయ్ చాలా స్టైలీష్ గా కనిపించాడు.   


ఈ టీజర్ లో విజయ్ మేనరిజం అభిమానులతో విజిల్స్ వేయించేలా వుంది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, భారీతనానికి ప్రతీకగా కనిపిస్తోంది. యూట్యూబ్ లో ఈ టీజర్ ను రిలీజ్ చేసిన 12 గంటల్లోనే 11 మిలియన్ల వ్యూస్ లభించాయి. ఇక 5 గంటల్లోనే వన్ మిలియన్ లైక్స్ వచ్చాయి .. ఇది ఒక రికార్డు అనేది కోలీవుడ్ టాక్.   ఇక ఈ చిత్ర తెలుగు వెర్షన్ టీజర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నారు. కీర్తిసురేష్ హీరోయిన్‌గా, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: