జూనియర్ ఆర్టిస్ట్ అనురాగ్ వినిల్ (నాని) ఆత్మహత్య!

Edari Rama Krishna
వర్ధమాన మ్యూజిక్‌ డైరెక్టర్‌, జూనియర్ ఆర్టిస్ట్ అనురాగ్‌ వినిల్ (నాని) ఆత్మహత్య కలకలం రేపుతోంది. వారం రోజుల కిందట అనురాగ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. పలు ప్రైవేట్ పాటలతో పాటు షార్ట్ ఫిలిమ్స్‌కు వినిల్ మ్యూజిక్ అందించాడు. నాగోల్‌లోని మమతానగర్‌లో నివాసముంటున్న అనురాగ్‌ను కొందరు వేధింపులకు గురిచేస్తున్నారని, కొందరి ప్రోద్బలంతో అతడు బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.  అతడు ఆత్మహత్య చేసుకున్న స్థలం, వివరాలపై భిన్న కథనాలు వెలుగు చూస్తున్నాయి.

వికారాబాద్‌‌ సమీపంలోని మర్పల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు చెబుతుండగా, హైదరాబాద్‌ నాగోల్‌ మమత నగర్‌లో సూసైడ్‌ చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అతని గర్ల్ ఫ్రెండే ఇందుకు కారణమని కూడా తెలియవచ్చింది.  ఈ నెల 9 న కేసు నమోదు చేసుకున్న హయత్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి…ఇతని స్నేహితులను విచారిస్తున్నారు.

అనురాగ్ కంపోజ్ చేసిన పాటల్లో…. నీలాకాశం, రిపబ్లిక్ డే స్పెషల్ గా వందేమాతరం అనే పాట, ఓ చెలియా అనే సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి.  అనురాగ్ మృతితో అతడి కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. అయితే, వినిల్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: