'డార్క్ సీక్రెట్' బిబిసి దర్శకునితో కాస్టింగ్ కౌచ్ - ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్

ఈ కాస్టింగ్ కౌచ్ అనేది చలన చిత్ర పరిశ్రమ నుండే ఉద్భవించింది.  అది ఆ కార్యాలయాల్లో ఉండే "కౌచెస్" సోఫాల్లాంటి ఫర్నీచర్. సినిమా కార్యాలయాల్లో కాస్టింగ్ డిపార్ట్మెంట్ వారు ఉండే స్థలంలో వీటిని ఏర్పాటు చేస్తారు. కాస్టింగ్ డిపార్ట్మెంటు లోనే నూతన నటీనటులను సహజంగా ఎంపిక చేస్తారు. అప్పుడు ఈ కార్యాలయ ఫర్నీచర్ను శృంగారానికి నిర్దేశించిన పడక ల్లాగా వాడేస్తారు. అంటే వీటిని మంచాలు అనవచ్చు. దీన్నించే పుట్టిందే  "కాస్టింగ్ కౌచ్"  అనే పదం జనించింది. 

అధికారం ఆలంబనగా ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి తన వద్దకు సహాయార్ధమో ఉద్యొగార్ధమో వచ్చిన అశక్తురాలిని లైంగిక అనుభవాన్ని బదులుగా కోరటాన్నే "కాస్టింగ్ కౌచ్"  అని అంటారు. అసలు అర్ధం  "సోఫా మీదకు నెట్టెయ్యటం"  దీన్నిబట్టి ఆ వ్యక్తి ఇష్టాయిస్టాలతో నిమిత్తం లేకుండా అందించిన లేక అందించబోయే అవకాశానికి "లైంగిక దోపిడి చేసి తృష్ణ తీర్చుకోవటం"  పరిహారంగా పొందటం"

జీవనోపాదికి వచ్చిన వారినుంచి ప్రాణాన్ని మించిన మానాన్ని పరిహారంగా వ్యక్తి ఇష్టాయిస్ఠాలతో నిమిత్తం లేకుండా తీసేసుకోవటం. భారత జాతి సాంప్రదాయ స్త్రీలకు "మానం"  ప్రాణం కంటే చాలా ఉన్నతం.  అంతటి మహోన్నత సాంప్రదాయం పాటించే ఈ దేశ స్త్రీల జీవితాల నుండి వారి అవసరం లేదా అభిరుచి (పాషన్) సాధించుకోవటానికి "కాస్టింగ్ కౌచ్" రూపంలో పరిహారం కోరుతున్న సినిమా రంగంలోని 24 క్రాఫ్ట్స్ కు చెందిన పురుషపుంగవులపై దేశవ్యాప్తంగా పోరాటం ఉదృతం అవుతున్నట్లు కనిపిస్తోంది. 


కాస్టింగ్ కౌచ్ వివాదం టాలీవుడ్ ను ప్రకంపనలతో కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ వివాదంతో అగ్గి రాజేసుకుంది. నేరుగా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ "బిబిసి బాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల" గురించి "బాలీవుడ్ డార్క్ సీక్రెట్" అనే పేరుతో డాక్యుమెంటరీ నిర్మించి ప్రసారం చెసే పని లో నిమగ్నమైంది. 

ఈ  డాక్యుమెంటరీ నిర్మాణత సందర్భంగా ప్రముఖ హీరోయిన్లు రాధికా  ఆప్టే, ఉషా జాదవ్ వంటి ప్రముఖులు అనేక హృదయ విదారక సంచలన విషయాలను వెల్లడించారు.  ఈ డాక్యుమెంటరీలో భాగమైన బాలీవుడ్ లో జరుగుతుండే "చీకటి కోణాలు" గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. హాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై "మీ టూ" అంటూ పెద్ద ఉద్యమమే ఉదృతంగా కొనసాగుతోంది.

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కాస్టింగ్ కౌచ్ ని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలతో ఈ అగ్గి మరీ ఉదృతంగా రాజుకుంది. ఆమె వ్యాఖ్యపట్ల ఇప్పుడు బాలీవుడ్ నుండే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని రంగాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. "ఇండస్ట్రీలో మహిళలని రేప్ చేసి రోడ్డుమీద వదిలేయడం లేదని అందుకు బదులుగా వారికి జీవనోపాది దక్కుతోందని" చెప్పిన సరోజ్ ఖాన్ వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా జ్వలిస్తున్నాయి. ఆ అగ్ని ఇప్పట్లో చల్లరేలాగా లేదు. 

బాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి ప్రఖ్యాత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మీడియా సంస్థ "బిబిసి" సంచలన డాక్యుమెంటరీని ప్రసారం చేయబోతోంది. "కాస్టింగ్ కౌచ్"  అనుభవాలు ఎదురుకోన్న హీరోయిన్ల అభిప్రాయాలతో ఈ డాక్యుమెంటరీని సిద్ధం చేసారు. రాధికా ఆప్టే, ఉషా జాదవ్ వంటి ప్రముఖ హీరోయిన్లు తమ చేదు అనుభవాలని బిబిసితో నిర్భయంగా, దాపరికంలేకుండా, నిర్మాణాత్మకంగా, ఈ అప్రదిష్ట కార్యక్రమాలకు అడ్డుకట్టవేసే ఉద్దేశంతో తమ జీవితంలోని చీకటి కోణాలని పంచుకున్నారు.

సినీ పరిశ్రమ అది బాలీవుడ్డే కాదు టాలీవుడ్ కోలీవుడ్ అన్నీ ఇండస్ట్రీలలో కొంత మంది తమకు తామే పరిశ్రమలో గాడ్ ఫాదర్స్ అని మూవీ మొగల్స్ అని పిలవబడే  "దేవుళ్ల" మని భావిస్తారని, వారిని కాదన్నా, వారిని ఎదురు తిరిగినా కెరీర్లే కాదు కొన్నిసందర్భాల్లో జీవితాలే నాశనం అయినట్లే అని రాధికా ఆప్టే పేర్కొంది. మహిళలు, పురుషులు కలసి కట్టుగా ముందుకు వచ్చి దీనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని రాధికా ఆప్టే పేర్కొంది.

"జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రముఖ హీరోయిన్ ఉషా జాదవ్" కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన "వృత్తి జీవితం - కారీర్" ఆరంభంలో ఈ తరహా  అనుభవం ఎదురైందని తెలిపింది. అవకాశం రావాలంటే నిర్మాతతో, దర్శకుడితో, అవసరమైతే ఇంకొందరితో పడుకోవాలని చెప్పారని వ్యాఖ్యానించింది. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న అమ్మాయిలంతా ముందుకు వచ్చి పోరాటం చేసి కనీసం తమ అభిజాత్యాన్ని అభిమానాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందని ఉషా జాదవ్ పేర్కొంది.

మరో వర్తమాన నటి బిబిసి డాక్యుమెంటరీలో సంచలన విషయాలు వెల్లడించింది. "ఇండస్ట్రీలో అవకాశం దొరకాలంటే వీలు దొరికప్పుడల్లా శృంగారంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు" అని తెలిపింది. ఒక వ్యక్తి తాను కోరుకున్నపుడల్లా వచ్చి తాకేవాడు, ముద్దు పెట్టుకునే వాడు, అతడి ప్రవర్తన నన్ను షాక్ కి గురిచేసిందని, అయినా కారీర్ కోసం భరించానని ఆ వర్థమాన నటి డాక్యుమెంటరీలో వెల్లడించింది. 

He touched, kissed me wherever he wanted: Actress Usha Jadhav shares casting couch experience


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: