‘మాజీ లవర్’ ఫోటో చూసి మురిసిపోయిన సుస్మితా సేన్..!

Vasishta

సుస్మితా సేన్ విశ్వసుందరిగానే కాక సినిమా స్టార్ గా వెలుగొందారు. అయితే వయసు మీద పడిపోవడంతో మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. విశ్వసుందరిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంతరించుకున్న సుస్మిత పెళ్లి చేసుకోలేదు. అయితే ఆమెకు గతంలో ఓ ప్రియుడుండేవాడు. తాజాగా అతని ఫోటోను చూసిన సుస్మిత మురిసిపోయింది.


          సుస్మితాసేన్ 1994లో మిస్ యూనివర్స్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమెకు అనేక సినిమాల్లో అవకాశాలొచ్చాయి. పలు విజయవంతమైన సినిమాల్లో కూడా ఆమె నటించారు. మిస్ యూనివర్స్ పోటీల సమయంలో ఆమెకు ప్యూర్టోరికోకు చెందిన ఫేమస్ సింగర్ రిక్కీ మార్టిన్ తో ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లపాటు వారి మధ్య ప్రేమ కొనసాగింది. అయితే అతను స్వలింగసంపర్కుడని తెలుసుకున్న సుస్మితా.. ఆ తర్వాత దూరంగా ఉండిపోయారు. అప్పటి నుంచి వారి మధ్య సంబంధాల్లేవు.


          2015లో సుస్మిత చివరిగా సినిమా చేశారు. పెళ్లి చేసుకోకుండా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రిక్కీ మార్టిన్ తో ఉన్న ఓ ఫోటోను ఓ అభిమాని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోను చూసి సుస్మిత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. రిక్కీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మెక్సికోలో మొదటిసారి రిక్కీని కలిసినప్పుడు దిగిన ఫోటో అదని గుర్తు చేసుకున్నారు. ‘అప్పుడు నా వయసు 18, అతని వయసు 22. ఇప్పుడు నేను ఇద్దరు ఆడ పిల్లల్ని దత్తత తీసుకుని పెంచుకుంటున్నా.. రిక్కీకి ఇద్దరు మగ పిల్లలు. మా ఇద్దరి జీవితాలు ఒకేలా ఉన్నాయి. చాలా క్రేజీ లైఫ్:” అని పోస్ట్ పెట్టారు.


          రిక్కీతో చాలా ఏళ్లపాటు ప్రేమలో మునిగిన సుస్మిత.. అతను హోమో సెక్సువల్ అని తెలిసి దూరమయ్యారు. ఆ విషయాన్ని ఆమె ఓ సందర్బంలో వెల్లడించారు. రిక్కీని చూస్తే ఇప్పటికీ గర్వంగా ఉంటుందన్న సుస్మిత.. మన డీఎన్ఎ గురించి చెప్పుకోవడానికి ఎంతో ధైర్యం ఉండాలని చెప్పింది. అతను స్వలింగ సంపర్కుడని తనకు తెలుసన్నారు. అతను సంతోషంగా ఉండాలనుకుంటున్నానని ఆశించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: