హీరో విజయ్ పై కోలీవుడ్ ఫైర్..!

Edari Rama Krishna
ఓ వైపు తమిళ ఇండస్ట్రీలో డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలకు వ్యతిరేకంగా చిత్ర పరిశ్రమ గత నాలుగు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఆందోళనలో భాగంగా తమిళ చిత్ర పరిశ్రమ మొత్తం షూటింగ్ లని నిలిపివేసింది. అందరూ నిరసనలో భాగం అవుతున్నారు. డిజిటల్ ప్రొవైడర్లతో చర్చలు జరుగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.



ఇంతలో చెన్నైలోని సెంట్రల్ సమీపంలో విక్టోరియా హాలు వద్ద తమిళ అగ్రనటుడు విజయ్ ప్రధాన పాత్రలో మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘విజయ్‌ 62’ సినిమా షూటింగ్‌ నిర్వహించారన్న వార్తలు వివాదం రేపాయి. అంతా సినిమాలు ఆపేసి నిరసన తెలియజేస్తుంటే విజయ్ మాత్రం చిత్ర షూటింగ్ ని ఎలా కొనసాగిస్తాడని సినీ ప్రముఖులు విరుచుకుపడుతున్నారు.

విజయ్ షూటింగ్ నిర్వహించడంపై జేఎస్కే సతీష్ సహా పలువురు నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రనటులకో న్యాయం, చిన్న సినిమా నిర్మాతలకో న్యాయమా? అని ప్రశ్నించారు. నిర్మాతల మండలిలో ఐక్యత లేదని, పెద్ద చిత్రాల షూటింగ్‌లకు అనుమతిచ్చి, చిన్న నిర్మాతలకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. బంద్‌ లో కూడా పక్షపాతం చూపించడం ఎంతవరకు సమంజసమని వారు నిలదీశారు. 

ఈ విషయంపై విజయ్ చిత్ర బృందం వివరణ ఇచ్చింది. ఈ చిత్రానికి ముందుగా ఫైట్ మాస్టర్స్ డేట్స్ ఇచ్చారని, ఇప్ప్పుడు షూటింగ్ జరపకపోతే తరువాత వారు అందుబాటులో ఉండరని చెబుతున్నారు. అందువలనే షూటింగ్ ని కొనసాగిస్తున్నామని అంటున్నారు. షూటింగ్ ఇప్పుడు ఆపేస్తే సినిమాకు భారీ నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. మురుగదాస్ దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రం దళపతి 62 అని వర్కింగ్ టైటిల్ ని కొనసాగిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: