మామయ్య "చిరు" బాటలో మేనల్లుడు"తేజ్" ...సెల్యూట్ !

Prathap Kaluva
మెగా హీరోలందరిలో మెగాస్టార్ పోలికలతో ఎవరైనా ఉన్నారా అని అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సాయి ధరమ్ తేజ్ . మెగాస్టార్ కుటుంబ వారసుడిగా పిల్లనువ్వులేని జీవితం అనే సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు. మొదట చేసిన అన్ని సినిమాలు దాదాపు హిట్ సాధించాయి. కానీ ఇప్పుడు చేసిన 5 సినిమాలు బాక్సఫీస్ వద్ద డీలా పడిపోయాయి. వివి వినాయక్ సినిమా మీద నమ్మకం పెట్టుకున్నా అది కూడా డిజాస్టర్ ను మూటగట్టుకుంది.


సినిమాల పరంగా అపజయాల్ని పొందుతున్నా వ్యక్తిత్వంలో మాత్రం అందరి హృదయాలను కొల్లగొడుతున్నాడు . అభిమానులంటే తేజ్ కు ప్రేమ ఎక్కువే. కానీ సాయం కోరివచ్చిన ఒక క్రీడాకారుణునికి ఆర్థిక సహాయం అందించి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకెళితే సూర్యపేటకు చెందిన పారా వాలీబాల్ ప్లేయర్ నరేష్ యాదవ్ బ్యాంకాక్‌లో జరిగిన అంతర్జాతీయ టోర్నీకి ఎంపికయ్యాడు. అయితే అతను ఆర్థిక సమస్యలతో సతమతమవుతుండడం వల్ల టోర్నీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. 


పత్రికల్లో అతడి గురించి కథనం రావడంతో తేజ్ స్పందించి నెల రోజుల క్రితం ఆయనకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాడు. ఇక ఆ టోర్నీలో భారత జట్టు అద్భుత ప్రతిభ కనపరచి స్వర్ణ పతకం సాధించింది. దీనికి సంబంధించి తేజ్ ట్విటర్లో కూడా స్పందించాడు. నరేష్ మాత్రం ఫ్లైట్ దిగగానే నేరుగా తేజ్ ను కలిసి తన పతకాన్ని ఆయనకు చూపించాడు. మామయ్యబాటలోనే మేనల్లుడు సమాజానికి సేవ చేయడం సినీ అభిమానులకు సంతోషాన్ని కలుగజేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: