‘దంగల్’ బబిత హీరోయిన్ గా వస్తుంది..!

siri Madhukar
బాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించి ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న చిత్రం ‘దంగల్’.  క్రీడారంగంపై సాగిన ఈ చిత్రంలో  అమీర్ మహావీర్ సింగ్ ఫోగాట్ పాత్రని పోషించారు. ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లైన అమీర్ కూతుళ్లుగా గీత, బబిత రోల్స్‌లో ఫాతిమా సనా, సాన్య మల్హోత్రలు న‌టించారు.   ఈ చిత్రంతో అమీర్తో పాటు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన వర్ధమాన హీరోయిన్‌గా సనా వెలిగిపోయింది. 

గ్రామీణ సమాజపు వెనుకబాటు తనం నుంచి కష్టపడి ఎదిగివచ్చి అంతర్జాతీయ కుస్తీ పోటీల్లో పాల్గొని పతకం సాధించిన గీతా పొగోట్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఫాతిమా సనా ఆమిర్‌ ఖాన్‌ తదుపరి చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’లోనూ పాతిమా నటించబోతోంది. విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కత్రినాకైఫ్‌ ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు.

ఇక బబిత  నటించిన సాన్య మల్హోత్ర ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా రూపొందుతున్న‌ ‘బధాయి హో’ సినిమా ద్వారా సాన్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఓ ఊహించ‌ని వార్త‌.. ఒక‌ కుటుంబాన్ని ఎలాంటి పెనుగులాటలకు దారి తీసిందో చెప్పే ఇతివృత్తంతో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. 

ఈ సినిమాను అమిత్ శర్మ దర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్, క్రోమ్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే జనవరి నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: