జబర్ధస్త్ టీమ్ పై నాగబాబు సీరియస్..ఆవేశంగా వాకౌట్..!

Edari Rama Krishna
తెలుగు బుల్లితెరపై ఈటీవి ప్రసారం చేస్తున్న ‘జబర్ధస్త్’ కామెడీ షో అంటే ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు భారత దేశం, ప్రపంచంలో ఉన్న అందరు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న ఈ జబర్ధస్త్ ప్రోగ్రామ్ కి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం జబర్ధస్, ఎక్స్ ట్రా జబర్థస్త్ తో అందరి హృదయాలు కొల్లగొడుతున్నారు.  ఇక జబర్ధస్త్ కామెడి షో తో యాంకర్లుగా ఎంట్రీ ఇచ్చిన అనసూయ, రష్మీలు తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. రష్మీ హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది..నటిస్తుంది. 

అనసూయ ఎన్నో ప్రైవేట్ ప్రోగ్రామ్స్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది.  జబర్ధస్త్ కామెడీ షో తో ఎంతో మంది ఔత్సాహికులు ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా రాణిస్తున్నారు.  వేణు, తాగు బోతు రమేష్, ధన్ రాజ్, శకలక శంకర్, చమ్మక్ చంద్ర తో పాటు ఈ మద్య ఆది కూడా ఓ సినిమాలో చాన్స్ దక్కించుకున్నాడు. జబర్ధస్త్ లో మొదటి నుంచి జడ్జీలుగా  మెగా బ్రదర్ నాగబాబు, నటి, ఎమ్మెల్యే రోజా వ్యవహరిస్తున్నారు. 

అయితే జబర్ధస్త్ లో డబుల్ మీనింగ్ ఎక్కువైందని, వ్యంగంగా కొన్ని స్కిట్స్ చేస్తున్నారని ఎన్నో ఆరోపణలు వస్తున్నా..ప్రోగ్రామ్ మాత్రం మంచి సక్సెస్ గా కొనసాగుతుంది.   ఇలా వెండితెర, బుల్లితెరపై తమ సత్తా చాటుతున్న జబర్ధస్త్ టీమ్ దసర పండుగ సందర్భంగా ‘దసరా మహోత్సవం’ కార్యక్రమాన్ని చేస్తున్నారు. 

ఈ సందర్భంగా జబర్ధస్త్ టీమ్ లో చిన్న గొడవ కావడం ఒకరిపై ఒకరు కామెంట్స్ చేస్తున్న సందర్భంలో సుడి గాలి సుదీర్ ఆవేశంగా మాట్లాడుతూ..నాగబాబు గారు ముందు నుంచి ఉన్న చిరంజీవి గారా..లేక మద్యలో వచ్చిన పవన్ కళ్యాన్ గొప్పా అన్నారు. దీంతో నాగాబాబు కి చిర్రెత్తుకొచ్చింది...వెంటనే తన సీట్లో నుంచి ఆవేశంగా లేచి ప్రోగ్రామ్ నుంచి వాకౌట్ చేస్తూ..టీమ్ వైపు వేలెత్తి సీరియస్ వార్నింగ్ ఇస్తూ..వాకౌట్ చేసి వెళ్లిపోయారు. 

తర్వాత రచ్చ రవి జడ్జీ రోజాను ఉద్దేశించి మాట్లాడుతూ..ఇప్పుడు చెప్పండి మేడం మీరు ఆ పార్టీ..ఈ పార్టీ మార్చడం కాదు ఏదో ఒక పార్టీలో ఉండండి అనడంతో అక్కడకు వచ్చిన రోజా తాను ఎమ్మెల్యేగా విజయం సాధించానంటే జబర్ధస్త్ లో అందరి అభిమానం చూరగొన్నందుకే అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.  ఆ తర్వాత అనసూయ మద్యలో కళ్లు తిరిగి పడిపోయింది.  ఇలా  ‘దసరా మహోత్సవం’  ప్రోమోలో ఎన్నో విడ్డూరాలు జరిగాయి.  మరి ఇది ప్రోమో కోసం క్రియేట్ చేసిందా..నిజంగా జరిగిందా అనేది  ‘దసరా మహోత్సవం’ చూస్తే తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: