సమంత బెదిరింపులను బయటపెట్టిన చైతన్య !

Seetha Sailaja
అక్టోబర్ లో పెళ్ళి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ లేటెస్ట్ ప్రేమ జంట నాగచైతన్య సమంతల ప్రేమ కథలో జరిగిన ఒక యదార్ధ విషయాన్ని చైతు స్వయంగా లీక్ చేసాడు. ఈవారం విడుదల కాబోతున్న ‘యుద్ధం శరణం’ సినిమాను ప్రమోట్ చేస్తూ నాగచైతన్య సమంత పై ఆశక్తికర కామెంట్స్ చేసాడు. 

చైతు సమంతల ప్రేమ వ్యవహారం కొద్దికొద్దిగా బయటకు లీక్ అవుతూ వస్తూ ఉన్నా వీరిద్దరి ప్రేమకు నాగార్జున ఓకె చెప్పడానికి కొంత కాలం పట్టిన విషయం తెలిసిందే. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారు అంటూ అనేక మీడియా సంస్థలలో వార్తలు వచ్చినా వాటి పై స్పందించకుండా నాగార్జున చాలాకాలం వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చాడు. 

అలాంటి పరిస్థులలో సమంతా నాగచైతన్యల పెళ్ళి వ్యవహారం పై గ్రీన్ సిగ్నల్ రప్పించడానికి సమంత ఒక వ్యూహాత్మకమైన మాటను చైతన్య పై ప్రయోగించిందట. వీలైనంత త్వరలో తమ పెళ్ళికి నాగచైతన్య అతడి కుటుంబ సభ్యుల నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకురాకపోతే తాను ఎదో ఒకరోజు ఒక అందమైన రాఖీ తీసుకువచ్చి చైతన్య చేతికి కట్టి ఈ ప్రేమ వ్యవహారానికి ముగింపు పలుకుతాను అంటూ సమంత చైతన్య పై వ్యూహాత్మక ఒత్తిడి పెట్టినట్లు అప్పటి సంఘటనలు గుర్తుకు చేసుకుంటూ చైతన్య జోక్ చేసాడు. 

అయితే సమంత బెదిరింపు తన మనసుకు ఎక్కడంతో తాను వేగం పెంచి సమంతతో తన బంధాన్ని నాగార్జునకు వివరించడమే కాకుండా తన కుటుంబ సభ్యుల అంగీకారం పొందేలా జాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని నవ్వుతూ వివరించాడు చైతన్య. ఇన్ని తెలివి తేటలు ఉన్నాయి కాబట్టే సమంత టాప్ హీరోయిన్ గా మారడమే కాకుండా ఏకంగా చరిత్రగల అక్కినేని వారి కుటుంబ కోడలుగా మారిపోతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: