రాజమౌళి బయటపెట్టిన ప్రభాస్ రానాల చీట్ మీల్ ప్రొగ్రాం !

Seetha Sailaja
‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రిటిలుగా మారిపోయిన ప్రభాస్ రానాలు ఆసినిమా కోసం పడ్డ కష్టాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో కధనాలు మీడియాలో వచ్చాయి.  రాజుల కాలంనాటి పాత్రల కోసం వీరిద్దరూ కండలు తిరిగిన శరీరాన్ని భారీగా పెంచడమే కాకుండా  దేహాదారుఢ్యం కోసం నానారకాలుగా కసరత్తులు చేశారు. మోతాదుకు మించి ఆహారాన్ని తీసుకొన్నారు. ఒక దశలో వీరిద్దరూ వంద కిలోలపైగా బరువు పెరిగారు.

ఇవన్ని ఇప్పటివరకు తెలిసిన విషయాలే అయినా ఈ మధ్య ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి  ప్రభాస్, రానాలు పడిన కఠోర శ్రమను గూర్చి కొన్ని ఆసక్తికర విషయాలను వివరించాడు. ప్రభాస్‌ ఒకే రోజు 15 రకాల బిర్యానీలు తినేవాడు అని అంటూ ‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్ రానాలు పడిన కష్టాలను వివరించాడు. 

ఇదే సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ ‘బాహుబలి 2’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రభాస్ రానాల మధ్య జరిగిన చీట్‌ మీల్‌ డే అని పెట్టుకొనేవారు. ఆరోజు మాత్రం ఎలాంటి ఆహార నిబంధనలు లేకుండా పుష్టిగా నచ్చిన ఆహారాన్ని తినవచ్చు. చీట్ మీల్ డే కార్యక్రమాలను వివరించాడు. ప్రభాస్‌ ఒకరోజు 15 రకాల బిర్యానీలు వండించుకున్న సందర్భాన్ని వివరిస్తూ తనకు అన్ని రకాల బిర్యానీలు ఉంటాయి అన్న విషయం కూడ తనకు తెలియదు అని జోక్ చేసాడు రాజమౌళి. 

ఒకరోజు ‘బాహుబలి 2’ షూటింగ్ సమయంలో తెల్లవారుజామున 2 గంటల వరకూ తామంతా వాలీబాల్ ఆడిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆ గేమ్‌ అయిపోయిన వెంటనే పలురకాల బిర్యానీలను ఎటువంటి చట్నీలు లేకుండా తినడానికి రెడీ అయిపోయిన రానా ప్రభాస్ లను చూసి తాను షాక్ అయిన నేపధ్యాన్ని వివరించాడు రాజమౌళి. మరో సందర్భంలో ప్రభాస్‌ మాత్రం ముందు చట్నీలు తిన్నాక మిగతా వంటలు తినడం మొదలుపెట్టాడు అని ఈ గేమ్ లో ప్రభాస్ స్పీడ్ ముందు రానా తట్టుకోలేకపోయిన నేపధ్యాన్ని వివరించాడు జక్కన్న.

అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం 100 కేజీల బరువు పెరిగిన ప్రభాస్ ప్రస్తుతం తాను లేటెస్ట్ గా నటిస్తున్న ‘సాహో’ కోసం అమెరికాలో సన్నగా మారడానికి అనేక డైటింగ్ నియమాలను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలో ప్రభాస్ యంగ్ లుక్ చూసి ఆశ్చర్యపడే విధంగా ప్రభాస్ తీవ్ర ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఒక సినిమా కోసం విపరీతంగా బరువు పెరగడం వెంటనే మరొక సినిమా కోసం సన్నగా అవ్వడం ప్రభాస్ పట్టుదలను సూచిస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: