బిబిసి లో బాహుబలి



బిబిసి లో బాహుబలి, అయితే ఏంటట అనకండి. సాధారణం గా బిబిసి లో ప్రసారమైన విషయం వార్త రూపం సంతరించు కుంటుంది. ఈ చానల్ ను ప్రపంచమంతా చూస్తుంది. అందుకే వార్త విశ్వ వార్త అవుతుంది. అంతేకాదు బిబిసి ప్రపంచ ప్రజల విశ్వాసం పొందింది. అందుకే బిబిసి ఇంటర్వ్యూ  అన్నా, బిబిసిలో వార్త వచ్చిందన్నా దానికో విలువ. మన ఇండియాలో హిందూ పత్రికకు అంత ప్రశస్తి వుంటూ వస్తుంది.




బాహుబలి చూడాలన్న ఫష్ట్ డే ఫష్ట్ షో చూడాలని ప్రజలు వేలం వెర్రిగా అనుకునేది కూడా ఒక రకమైన మానియానే. ఆ మేనియా కూడా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ను ఉర్రుతలూపే స్తుంది. ఒక రకమైన ఉన్మాదం లాంటి భావన ప్రజల్లో అలుముకుంది.   ఆ అతృతే జనాన్ని  ఊపే స్తోంది. అమెరికా, బ్రిటన్ తేడా లేకుండా విడుదలైన ప్రతి చోటా భారతీయ సినిమా సత్తాను స్టామినాను చాటుతూ దాన్ని వసూళ్ళ వెల్లువ వరదే కాదు కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తోంది.


దీంతోప్రతిష్టాత్మక బీబీసీ చానల్ కు కూడా ఆ మానియాను చూసి కవరేజ్ యివ్వకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది.  అందుకే బిబిసి లో కూడా బాహుబలిపై కవరేజ్ ఇచ్చింది. చానల్ ప్రైమ్ టైమ్ లో, దిగ్గజ దర్శకుడు రాజమౌళి, కథానాయకి స్వీటీ అనుష్కతో ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేసింది.




భారతీయ సినిమా స్థాయి, బాహుబలితో మరింత పెరిగిందన్న బీబీసీ, అమెరికాలో టాప్ 3 పొజిషన్ లో భారతీయ సినిమా నిలవడం మామూలు విషయం కాదని చెప్పింది. “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 - గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ 2”  లాంటి సినిమా లపై బాహుబలి ప్రభావం చూపెట్టిందని బీబీసీ కామెంట్ చేసింది. తెలుగు, హింది  వెర్షన్లు  మాత్రమే కాక.. అమెరికాలో తమిళ్ వెర్షన్ బాహుబలి కూడా వసూళ్లు  బాగా రాబడుతున్నట్టు చెప్పింది.


బాహుబలి నిర్మించిన తీరు, రాజమౌళి దర్శకత్వ ప్రతిభను ప్రశంసించిన బీబీసీ, ఈ సినిమాతో, హాలీవుడ్ స్థాయికి భారత సినిమా మరింత చేరువైందని స్పష్టం చేసింది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: