బాహుబలి అశ్వమేధ జైత్రయాత్ర - వసూళ్ళ చరిత్రను చెరిపేసింది.





ఒక్క వారం అంటే వారమే కూడా కాలేదు బాహుబలి 2, ది కంక్లూజన్ అశ్వమెధయాగం ప్రారంభమై. ఈ వారములో టాలీవుడ్, కొలీవుడ్, సాండల్ వుడ్, మాలివుడ్, బాలీవుడ్ లాంటి దాదాపు ఒక శతాబ్ధం చరిత్ర ఉన్న అనేక చలన చిత్ర సార్వభౌమ రాజ్యాలను జనం విభ్రమం చెందేలా దునుమాడుతూ దూసుకు పోతూంది. ఈ సంభ్రమ విజయ పతాకం అమెరికాలోనే కాదు విశ్వమంతా విహారం చేయబోతుంది. దంగల్ "ఫుల్ రన్ కలక్షన్స్"  ఒకే ఒక్క వారంలోనే దాటేసింది బాహుబలి. 


వెండి తెరపై విస్పోఠనమే కాదు, వెన్నెల వెలుగులూ చిమ్ముతూంది రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్య  దృశ్యాల సమాహారాన్ని ప్రేక్షకులను గళశీమలో అలంక రించి వాళ్ళకు కొత్త ప్రపంచం ఏలా ఉంటుందో రుచి చూపింది. ఆ వైభవాల అనుభూతిలోకి తీసుకెళ్లింది. కొత్త అనుభూతిని ప్రేక్షకులకు  చిరకాలమూ గుర్తుండేలాగా  కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 




ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్, తమన్నా, ఇలా సాధారణ స్థాయి నుండి విశ్వస్థాయి నటులుగా ఎదిగి పోయారు. అందరూ తమ నటనతో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ సినిమా మాత్రం ఇప్పటివరకూ మిగతా సినిమా లు సాధించిన రికార్డుల సరిహద్దులను చెరిపి  విశ్వాన్ని ఏకం చేసింది  బాషా ప్రాంత సరిహద్దులను చెరిపి  భారతీయ సినిమా ల్లో "వసూళ్ళ సార్వభౌముడు" అనిపించుకుంది "బాహుబలి: ది కన్‌క్లూజన్‌"  




మొదటి భాగమైన "బాహుబలి: ది బిగినింగ్‌" దాదాపు 600 కోట్ల రూపాయలు మార్క్  దాటి వసూళ్ళు చేయగా ఈ రెండో భాగం అంతకు మూడింతలవరకు వరకు వసూలు చేస్తుందేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. వారి అంచనాకు నిదర్శనంగా ఈ చిత్రం ఆరో రోజు వసూళ్లు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా వసూళ్లలో ప్రథమ స్థానం లో నిలిచి భారతీయ సినిమా "పీకే" "దంగల్"  బాలీవుడ్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. "పీకే"  మొత్తం ఫుల్ రన్ కలక్షన్స్ 743 కోట్ల రూపాయలు. అలాగే "దంగల్"  రికార్డ్ 760 కోట్ల రూపాయలుని కూడా క్రాస్ చేసేసింది.  





"బాహుబలి" విడుదలైన అన్ని భాషలతో కలుపుకుని ఆరో రోజుకే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 792 కోట్లు వసూలు చేసింది. మామూలుగా ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌కి మొదటి వారం టికెట్స్‌ దొరకవు. అయితే "బాహుబలి–2" కి వచ్చిన క్రేజ్‌ ధిగ్దిగంతాలను  (ధిక్ దిగంతాలను)  ఏకం చేసింది. రెండో వారానికి ఎంటరవుతున్నప్పటికీ టికెట్స్‌ సులువుగా దొరికే పరిస్థితి లేదు. 




దీన్నిబట్టి పది రోజుల్లో ఈ చిత్రం వెయ్యి కోట్లు వసూలు చేస్తుందని అంటున్నారు చలనచిత్ర వ్యాపార పండితులు అంచనా వేస్తున్నారు. భారతీయ సినిమాల్లో మార్కెట్‌ పరంగా తొలి స్థానం స్థానం హిందీ చిత్రాల బాలీవుడ్ దే. ఇప్పుడా స్థానాన్ని "బాహుబలి" ది కంక్లూజన్  దక్కించుకుంది.



1,000 నుంచి 1,500 కోట్లు వరకు "ఫుల్ రన్ మరియు ఫైనల్‌ కలెక్షన్స్‌"  ఉంటాయని ట్రేడ్‌ వర్గాలు అంచనా. అంతే కాదు ఈ నేపథ్యంలో ఈ సినిమా సృష్ఠించే రికార్డ్‌ని "సమీప కాలం"  లో ఏ భారతీయ సినిమా అధిగమించలేదని అంటున్నారు. మరి, "బాహుబలి" రికార్డ్‌ను భవిష్యత్ లో ఏసినిమా చెరిపేస్తుందో అని వేచిచూడాల్సిన పరిస్థితి. "వసూళ్ళ చేలియలి"  కట్ట తెగిందా! కడలి దూకూడు వసుళ్ళలో కనిపిస్తుంటే ఆ నటీనటుల దర్శక నిర్మాతం అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: