జబర్దస్త్ లో వినోదిని ఆడా..? మగా..?

shami
బుల్లితెర మీద సంచలన విజయాన్ని అందుకుని ప్రతి గురు, శుక్రవారాల్లో మస్త్ జబర్దస్త్ నవ్వులతో హుశారెత్తించే జబర్దస్త్ ప్రోగ్రాంలో ఎంత వల్గారిటీ ఉందా అన్నది పక్కన పెడితే అందులోని కామెడీకి బుల్లితెర వీక్షకులందరి ఫ్యాన్స్ గా మారారు. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో వచ్చే ఈ ప్రోగ్రాం ఈటివిలో ప్రసారమవుతుంది.


అయితే ముందు ఒకే జబ్దర్దస్త్ గా ఉన్న ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా యాడ్ అయ్యింది. ఇక ఈ రెండు ప్రోగ్రాంస్ ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. అయితే జబర్దస్త్ షోలో ఇంతకుముందు ఆడవాళ్లు వచ్చే వారు కాని ఇప్పుడు షోలో కనిపించేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకే మగవారే ఆడవేశం వేస్తున్నారు.


షో స్టార్ట్ అయిన నాటి నుండి ఆడవేశంతో అలరిస్తున్న వారు ఉన్నారు. ఇక అందులో ముఖ్యంగా వినోద్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పటికి వినోద్ ఆడా మగా అన్న డౌట్ వస్తుంది. ఏ టీంలో అయినా ఆడ వేశం అంటే అది వినోద్ మాత్రమే చేస్తుండటం విశేషం. అయితే వినోద్ ను అసలు మగవాడిలా చూడాలని అందరికి ఉంటుంది. అందరు అతన్ని వినోద్ కాదు వినోదిని అని ఫిక్స్ అయ్యారు కూడా.


కాని వినోద్ ఓ మిమిక్రి ఆర్టిస్ట్ అతను కూడా జబర్దస్త్ షోలో ఎప్పటినుండో కామెడీ చేస్తున్నాడు. తన బాడీకి లేడీ గెటప్ అయితే బాగుంటుంది అని వినోద్ ను కాస్త వినోదినిగా చేసేశారు టీం లీడర్స్. వినోద్ షోలో పర్ఫార్మెన్స్ చూసి చాలామంది అతను అమ్మాయే అన్న ఆలోచనలో ఉన్నారు.   


కాని వినోద్ కేవలం జబర్దస్త్ షో కోసమే అమ్మాయి గెటప్ లో కనిపిస్తున్నాడు. చంద్ర టీం, రచ్చ రవి టీంలలో ఎక్కువగా కనిపీంచే వినోద్ అవకాశం ఉంటే ప్రతి టీం లీడర్ తో పనిచేస్తాడు. షోలో భాగమయినందుకు అది లేడీ గెటప్ తో అందరికి సుపరిచితుడైనందుకు వినోద్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. వినోద్ మేకప్ లేకుండా బయటకు వెళ్తే తనను ఎవరు గుర్తుపట్టరట. వినోదినిగా మాట్లాడిన తర్వాత అతను జబర్దస్త్ కంటెంట్ అని గుర్తిస్తారట. సో అలా వినోద్ ను కాస్త వినోదినిగా మార్చిన ఘనత జబర్దస్త్ షో దక్కించుకుంది.    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: