హీరోయిన్ తమ్ముడిని అరెస్టు చేసిన పోలీసులు..!

Edari Rama Krishna
చట్టానికి ఎంతటి వారైనా శిక్షార్హలు తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు ఇదీ చట్టం రూల్.. ఇంతకీ ఈ చట్టం ఏంటీ ఎవరి గురించి అనుకుంటున్నారా..! బాలీవుడ్, హాలీవుడ్ లో దూసుకు పోతున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా సొంత సోదరుడి విషయంలో..అసలు విషయానికి వస్తే.. ఈ మద్య ప్రియాంక సోదరుడు హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు పూర్తి చేసి తను సొంతగా డిజైన్ చేసుకున్న ఓ హోటల్ నడుపుతున్నాడు. ‘ద మగ్ షాట్ లాంజ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ హోటల్ లో ఇప్పుడు పెద్ద వివాదం చోటు చేసుకుంది.  రీసెంట్ గా ఆ హోటల్ పై పోలీసుడు దాడి చేసి 10 మందిని అరెస్ట్ చేసి.. మేనేజర్‌పై కేసు నమోదు చేశారు.  

అయితే ప్రియాంక సోదరుడు మేనేజర్ గా ఉన్న ఈ హోటల్ లో ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతోందంటూ చేసిన ఈ దాడిలో భారీ ఎత్తున క్యాష్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ మద్య వరుసగా భాదకర సంఘటనలు ఎదురైతున్న ప్రియాంకకు ఇంకో చేదువార్త ఎదురైంది. అదే హోటల్‌లో హుక్కాతోపాటు విచ్చలవిడిగా స్మోకింగ్ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు.  వాస్తవానికి ఆ ఏరియా మొత్తం నో స్మోకింగ్ జోన్ కింద ప్రకటించారు. కానీ  చట్ట విరుద్ధంగా సాగుతున్న వ్యవహారం కావడంతో పోలీసులు దాడి చేయాల్సివచ్చింది.  

అప్పటికీ పోలీసులు హెచ్చరికలు చేసినప్పటికీ ఆమె సోదరుడు వినిపించుకోక పోవడంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం 10 మందిని అరెస్ట్ చేసి.. మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. పదేపదే తమ కుటుంబ సభ్యుడి వలన ప్రియాంక సోదరుడి మూలంగా తాము వార్తల్లోకెక్కి అవమానాలు భరించాల్సి వస్తోందని నటి ఫ్యామిలీసభ్యులు తెగ ఫీల్ అయి పోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: