Money: రిస్క్ తక్కువ.. రాబడి ఎక్కువ.. ఎలా అంటే..?

Divya
ఈమధ్య కాలంలో బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే లోన్ పై వడ్డీని కలెక్ట్ చేస్తూ ఉంటాయి ఒకవేళ అదే కస్టమర్ అకౌంట్లో ఉన్న మొత్తానికి వడ్డీని కూడా చెల్లిస్తూ ఉంటాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం పైనే బ్యాంకు ఆదాయం కూడా ఆధారపడి ఉంటుందని సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న డిపాజిట్లపై రాబడి ఎక్కువగా లభించడం లేదు. అందులోనూ సేవింగ్స్ అకౌంట్ లో డబ్బుపై వడ్డీ రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అందుకే చాలామంది ఇప్పుడు బ్యాంకులను నమ్ముకోకుండా వడ్డీ రేట్లు అధికంగా ఇచ్చే పెట్టుబడి మార్గాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మీరు కూడా ఎక్కువగా రిస్కు తీసుకోకుండానే డిపాజిట్ ల పై ఎక్కువ వడ్డీ పొందే స్ట్రాటజీల కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీకోసం కొన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
అందులో మొదటిది హై ఇంట్రెస్ట్ సేవింగ్స్ అకౌంట్.. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని బ్యాంకులు ట్రెడిషనల్ అకౌంట్ల కంటే ఎక్కువ వడ్డీ రేట్లతో స్పెషల్ సేవింగ్స్ అకౌంట్ లోనే ఎప్పుడు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంకులు కూడా ఆకర్షణీయమైనా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఎందుకంటే ఫిజికల్ బ్రాంచెస్ మెయింటైన్ చేసే ఖర్చులు వీరికి ఉండదు.. ఎక్కువ వడ్డీ ఇచ్చే సేవింగ్స్ అకౌంట్లకు స్విచ్ అయితే రాబడి కూడా పెరుగుతుంది. ఇందులో రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది.
మనీ మార్కెట్ అకౌంట్.. ఇక్కడ మనీ మార్కెట్ అకౌంట్ లు సేవింగ్స్ అలాగే చెకింగ్ అకౌంట్స్ రెండింటి ఫ్యూచర్స్ ని కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ కంటే ఎక్కువ వడ్డీ పొందవచ్చు.  మార్కెట్ అకౌంట్లో అధిక ఫీజులు,  మినిమం బాలన్స్ రిక్వైర్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది.
వీటితోపాటు బాండ్స్ లో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ సేవింగ్స్ అకౌంట్లతో పోలిస్తే ఈ బాండ్స్ ద్వారా ఎక్కువ రాబడి లభిస్తుంది. పైగా విత్ డ్రా పై కొంత రిస్కు పరిమితులు ఉన్నా మంచి వడ్డీ మాత్రం అందుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: