Money: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..త్వరలో జీతాల పెంపు.!

Divya
తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త తెలిపింది.  అది కూడా ఏకంగా రెండు శుభవార్తలు చెప్పడం నిజంగా హర్షదాయకమని చెప్పాలి. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండుసార్లు డి ఏ పెంచుతున్న విషయం అందరికీ తెలిసిందే.. అందులో ఒకసారి జనవరిలో.. మరొకసారి జూలైలో.. డీఏ పెంపు జరుగుతూ ఉంటుంది. ఈ రెండు డి ఏ లు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతాయి అందుకే ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు పెంచడం జరిగింది. అయితే ఇప్పుడు మరొకసారి 2023 కు సంబంధించిన డీఏ జనవరిలో పెరగకుండా మార్చిలో పెరిగింది. అయితే 2023 నుంచే అది అమలులోకి రావడం గమనార్హం.
జూలైలో పెరగాల్సిన డిఏ పెంపుపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈ డి ఏ పెంపుతో పాటు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ని కూడా కేంద్రం పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనివల్ల జీతం బాగా పెరుగుతుంది అని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ద్వారా బేసిక్ వేతనం రూ. 18000 నుండి రూ.26 వేల వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. డి ఏ పెంపు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ పై కేంద్రం ఒకేసారి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తాజా సమాచారం. ఇకపోతే 2023 జూలైలో పెరగబోయే డి ఏ నాలుగు శాతం పెరిగింది అంటే అది 42 నుంచి ఇప్పుడు 46 శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..
తో భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగడమే కాదు వారి కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇకపోతే వీటితోపాటు కోవిడ్ సమయంలో పెండింగ్లో ఉన్న 18 నెలల డిఏ బకాయిలు కూడా రావాల్సి ఉండగా సుమారుగా రెండు లక్షల రూపాయల వరకు ఒక్కొక్క ఉద్యోగికి ఈ డబ్బు అందాల్సి ఉంది . ఇప్పుడు దీనిని కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: