Money: నడుస్తూ కూడా డబ్బు సంపాదించవచ్చు.. ఎలా అంటే..?

Divya
నడిస్తే డబ్బులు ఎలా వస్తాయి.. పనిచేస్తే డబ్బులు వస్తాయి కదా అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం గూగుల్ ప్లే స్టోర్ ఒక అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది దీనిని మీరు సైన్ అప్ చేసి ఉపయోగిస్తే మీకు డబ్బులు వస్తాయి. మరి ఆ యాప్ ఏంటి ? దానిని ఎలా ఉపయోగించాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
గూగుల్ ప్లే స్టోర్ నుండి Growfitter అనే ఒక అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని మీరు సైన్ అప్ చేసినప్పుడు 20 నాణేలను పొందుతారు అలాగే మీరు ఈ యాప్ గురించి ఇంకొకరికి సూచిస్తే వారు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు మరో 15 నాణేలు లభిస్తాయి. ఇకపోతే మౌంటైన్ బైక్, గోల్డ్ కాయిన్, మొబైల్ ఫోన్, యోగ మ్యాట్, అలెక్సా, పలు వోచర్లు కూడా ఈ అప్లికేషన్లో అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే ఈ అప్లికేషన్ లో వాకింగ్,  సైక్లింగ్, రన్నింగ్ చేసే వారికి ప్రత్యేకమైన బహుమతులు కూడా లభిస్తాయి.
ఇకపోతే మీరు ప్రతిరోజు నడిచే ప్రతి 1,000 అడుగులకు మీకు ఒక గ్రో ఫిట్టర్ పాయింట్ లభిస్తుంది. ఈ పాయింట్ ద్వారా మీకు నచ్చిన వస్తువుని మీరు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ యాప్ ఆ వస్తువులను ఉచితంగా మీ ఇంటికి డెలివరీ చేస్తుంది. ఇకపోతే ఇలాంటి మరొక ఆప్ కూడా అందుబాటులో ఉంది దాని గురించి కూడా మనం చదివి తెలుసుకుందాం.
అదేంటంటే స్టెప్ సెట్ గో.. ఈ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇది ఒక పెడోమీటర్.. క్యాలరీ కౌంటర్ అలాగే స్పోర్ట్స్ ట్రాకర్.. ఇక ఇది మీరు వేసే ప్రతి అడుగుకి మీకు మంచి ప్రతిఫలం ఇస్తుంది. అలాగే ఆరోగ్యం, ఫిట్నెస్ , వ్యాయామం ద్వారా ప్రజలను ఉత్తేజితం చేసి వారిని ఆరోగ్యవంతులను చేయడమే ఈ ఆప్ యొక్క లక్ష్యం. అంతేకాదు ఈ ఆప్ ద్వారా ఐఫోన్ ఎక్స్ ఎస్ మొదలైన బహుమతులను కూడా సొంతం చేసుకోవచ్చు.భారతదేశంలో పాటు ఇతర అనేక దేశాలలో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన అప్లికేషన్ కూడా ఇదే కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: