Money: ఈ సాగుతో రూ.5 లక్షలకు పైగా ఆదాయం..!

Divya
ప్రస్తుతం అత్యాధునిక పద్ధతులు, శాస్త్రవేత్తల సూచనల ఆధారంగా రైతులు తమ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సాంప్రదాయ పంటలతో పాటు కూరగాయల సాగుతో కూడా రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. ఏదైనా పంట సాగు వేసినప్పుడు అధిక దిగుబడి, ఎక్కువ లాభం పొందాలంటే రైతులు ఆధునిక పద్ధతులను అవలంబించాల్సిందే. ఈ నేపథ్యంలోనే టమాటా సాగుతో లక్షల సంపాదిస్తున్నారు రైతులు. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే రాజస్థాన్లోని కరౌళీ లో ఉన్న గ్రామీణ ప్రాంతాల రైతులు సీజన్కు అనుగుణంగా ఉండే ప్రత్యేక కూరగాయలను పండించడమే కాదు వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలను తీసుకొస్తూ తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఎండాకాలం కావడంతో కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టమోటాల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఒకప్పుడు గోధుమలు ,మినుములు పండించే రైతులు ఇప్పుడు కూరగాయలను పండిస్తూ మరింత ఆదాయాన్ని పొందుతున్నారు.  ఇక గోధుమలు,  ఆవాలు వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా టమాటా,  పొట్లకాయ వంటి పంటలు  సాగు చేస్తే ఆదాయాన్ని మంచిగా రెట్టింపు చేసుకోవచ్చు . ఈ పంటలకు నీరు పెద్దగా అవసరం ఉండదు. వేసవికాలంలో కొద్దిపాటి నీటితో ఈ పంటను మీరు పండించవచ్చు.
టమాటా మొక్కలను నాటడానికి ముందు నేలను నాలుగు రోజులపాటు నీటిని పారించి నేలను నానబెట్టుకోవాలి. ఇక మొక్కలను నాటడానికి ముందు నువాక్రాన్ 15 ఎంఎల్ , డితెన్ ఏం -45 25 గ్రాములు పది లీటర్ల నీటిలో కలిపి 5, 6 నిమిషాల పాటు మొక్కలను ద్రావణంలో ఉంచి ఆ తర్వాత మొక్కలను నాటుకోవాలి . ఇకపోతే ఈ పద్ధతి సాయంత్రం వేళ అవలంబిస్తే మొక్కల ఎదుగుదల బాగుంటుంది.. అంతేకాదు పంట దిగుబడి బాగా వస్తుంది. అలాగే మధ్య మధ్యలో కలుపు మొక్కలు కూడా తీస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ టమోటా పంట సంవత్సరానికి రూ. 5 లక్షలకు పైగా ఆదాయాన్ని అందిస్తోంది. వర్షాకాలం కంటే వేసవికాలంలోనే అధిక దిగుబడి పొందుతున్నారు రైతులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: