మనీ: రైతుల ఖాతాలో డబ్బు జమ..!

Divya
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీం కింద అర్హత కలిగిన రైతులకు 2000 రూపాయలను అందించనున్న విషయం తెలిసిందే. దీనివల్ల చాలామంది రైతులకు ఊరట కలుగుతుంది. భారత ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద 13 వ విడత డబ్బులను ఈరోజు రైతుల ఖాతాలలోకి జమ చేయనుంది. సాయంత్రం కల్లా ఈ డబ్బులు అన్నదాతల బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. ఈరోజు ప్రధాని మోదీ ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారు. కర్ణాటకలోని బలగావిలో జరగనున్న ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ పీఎం కిసాన్ 13వ విడత డబ్బులను విడుదల చేయనున్నారు.
సుమారుగా 8000 మంది రైతులకు నేరుగా ఈ డబ్బులను రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మోదీ కర్ణాటక వెళ్లడం.. ఈ ఏడాదిలో ఇది ఐదవ సారి.. ఎన్నికలే ఇందుకు కారణమని చెప్పాలి.. ఈసారి పర్యటనలో శివమొగ్గ ఎయిర్ పోర్ట్ ను  ఆయన ప్రారంభించబోతున్నారు. అలాగే పలు ఇతర ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 12 విడతల డబ్బులను అన్నదాతలకు అందించగా అంటే 24 వేల రూపాయలు రైతులకు లభించినట్లే . ఇప్పుడు 13వ విడత సందర్భంగా డబ్బులు కూడా రాబోతున్నాయి.  దీన్ని బట్టి చూస్తే రైతులకు ఇప్పటివరకు 26 వేల రూపాయలు వచ్చినట్లు తెలుస్తోంది.
సీఎం కిసాన్ స్కీమ్ లో చేరిన వారు ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలి.  అప్పుడే ఈ డబ్బులు పొందడానికి అవకాశం ఉంటుంది..  ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోలేదు వారికి డబ్బులు రాకపోవచ్చు కాబట్టి అన్నదాతలు ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తించుకోవాలని అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇకపోతే ఈ విషయం తెలిసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసరాకు లభించే ఈ డబ్బులు రైతులకు ఎంతో అండగా నిలవనున్నాయి. ఏది ఏమైనా పిఎం కిసాన్ పథకం ద్వారా చాలామంది రైతులు లబ్ధి పొందుతున్నారు అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: