మనీ: ఈ స్కీమ్ తో రూ.6లక్షలకు పైగా లాభం.. ఎలా అంటే..?

Divya
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ను అత్యధిక వడ్డీ రేట్లు ఇస్తూ భారీ ప్రయోజనాలను కల్పించే విధంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పోస్ట్ ఆఫీస్ లో మొదలుకొని అనేక ప్రభుత్వ ప్రైవేటు దిగ్గజ బ్యాంకులు కూడా స్మాల్ సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేట్లు పెంచుతూ మరింత ఎక్కువగా అట్టడుగు బలహీనవర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా ఇస్తున్నాయి. ఈ క్రమంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన.. ఒక పోస్ట్ ఆఫీస్ పథకంలో డబ్బులు ఆదా చేసినట్లయితే మీకు రూ.6 లక్షలకు పైగా లాభం లభిస్తుంది. మరి ఆ పథకం ద్వారా ఎలా ఏ విధంగా లాభం పొందవచ్చు.. అనేది ఇప్పుడు చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రవేశపెట్టిన పథకాలలో సీనియర్ సిటిజన్స్ కు ఎక్కువగా ప్రయోజనం అందించే విధంగా ఉన్నాయి.  వీటితోపాటు పిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన,  పెద్దవారి కోసం పీపీఎఫ్ పథకాలు ప్రస్తుతం అందుబాటులోకి రావడమే కాకుండా వీటి ద్వారా అధిక వడ్డీ రేట్లు కూడా ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కోసం అందిస్తున్న పథకాలలో డబ్బులు పెట్టడం వల్ల ఏ విధంగా లాభం వస్తుంది అనే విషయానికి వస్తే భారత ప్రభుత్వం జనవరి 1వ తేదీ నుంచి ఈ పథకం పై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే మొన్నటి వరకు సీనియర్ సిటిజన్స్ పథకంపై 7.6% వడ్డీ రేటు అందిస్తూ ఉండగా.. ఇప్పుడు 8 శాతానికి పెంచి మొత్తం భారీ వడ్డీ రేట్లు అందించే ప్రయత్నం చేస్తుంది . ఈ క్రమంలోనే పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులకు వెళ్లి మీరు ఈ పథకంలో చేరి మంచి లాభం పొందవచ్చు. గరిష్టంగా రూ.15 లక్షల వరకు డబ్బులు దాచుకోవచ్చు. ఉదాహరణకు ఇందులో మీరు రూ.5 లక్షల  స్కీం కింద డిపాజిట్ చేస్తే ఐదేళ్ల తర్వాత మీకు రూ.7 లక్షల లభిస్తాయి. దీన్ని బట్టి చూస్తే అదనంగా రూ.2లక్షలు మీ ఖాతాలో జమవుతాయి . ఒకవేళ రూ.6లక్షలు మీరు వడ్డీ పొందాలంటే రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: