మనీ: ఎల్ఐసి అందిస్తున్న ఈ పథకంతో కోటీశ్వరులు మీరే..!

Divya
తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటిలాగే ఇప్పుడు కూడా కస్టమర్ల అవసరాలను గుర్తించి సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల ఎల్ఐసి ధన్ వర్షా ప్లాన్ పేరుతో కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. పాలసీ హోల్డర్లకు రక్షణతో పాటు సేవింగ్స్ కూడా అందించడం ఈ పాలసీ యొక్క ముఖ్య ప్రత్యేకత.. ముఖ్యంగా పాలసీ హోల్డర్ మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండడానికి ఈ పాలసీ ముందు వరుసలో ఉంటుంది. అలాగే మెచ్యూరిటీ సమయంలో కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పొందవచ్చు.
ముఖ్యంగా ఎల్ఐసి ధన్ వర్షా ప్లాన్ రెండు ఆప్షన్స్ తో లభిస్తుంది.  టర్మ్ కూడా వేరువేరుగా ఉంటుంది.  15 సంవత్సరాల టర్మ్ పాలసీకి కనీస వయసు మూడు సంవత్సరాలు.. అయితే 10 సంవత్సరాల కూడిన పాలసీకి కనీస వయసు పది సంవత్సరాలు. కనీస మెచ్యూరిటీ వయసు 18 సంవత్సరాలు.  అయితే ఇది కేవలం సింగిల్ ప్రీమియం పాలసీ మాత్రమే.. అంటే ఈ ప్రీమియం మీరు ఒక్కసారి చెల్లిస్తే చాలు. ఉదాహరణకు మీకు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 15 సంవత్సరాల టర్మ్ తో పాలసీ తీసుకుంటే ఎల్ఐసి ధన్ వర్ష ప్లాన్ తీసుకున్నట్లయితే సింగిల్ ప్రీమియం జిఎస్టి తో కలిపి రూ.8,34,652 చెల్లించాలి.

బేసిక్ సమ్ అస్యూర్డ్ రూ.10,00,000. సమ్ అస్యూర్డ్ ఆన్ డెత్ రూ.79,87,000 లభిస్తుంది.  బెనిఫిట్స్ విషయానికి వస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.16 లక్షల బెనిఫిట్ లభిస్తుంది.  గ్యారెంటీ ఆడిషన్స్ తో డెత్ బెనిఫిట్ కింద రూ. 85 లక్షల వరకు
పొందవచ్చు.  ఒకవేళ బేసిక్ సమ్ అస్యూర్డ్ కింద రూ. 12 లక్షల తీసుకుంటే కోటి రూపాయల వరకు బెనిఫిట్ లభిస్తుంది. ఇంతకంటే బెస్ట్ పాలసీ మరొకటి లభించదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: