మనీ: రైతులకు శుభవార్త తెలిపిన మోడీ ప్రభుత్వం..!

Divya
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ముఖ్యమైన పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను కూడా పరిష్కరించ డానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక విధాలుగా సబ్సిడీ ప్రయోజనాలను అందిస్తూ ఉండడం గమనార్హం.. ప్రస్తుతం వ్యవసాయం లో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఈసారి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికను రూపొందించింది.. సబ్సిడీపై డ్రోన్లను సద్వినియోగం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ముఖ్యంగా డ్రోన్లను ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు.  వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించాలన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందుకోసమే రైతులను ప్రోత్సహించడానికి దాని కొనుగోలుపై సబ్సిడీ ఇచ్చే పథకాన్ని సిద్ధం చేశారు. డ్రోన్ కు అయ్యే ఖర్చులో  50% సబ్సిడీ గరిష్టంగా రూ.5 లక్షల వరకు రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించబోతోంది. ఈ క్రమంలోని డ్రోన్ ల సహాయంతో రైతులు తక్కువ సమయంలో పొలంలో నిలబడి పంటలపై సులువుగా ఎరువులు,  ఇతర పురుగుమందులను పిచికారీ చేయవచ్చు.
దీంతో రైతులకు చాలా సమయం ఆదా అవుతుంది.  అలాగే పురుగుమందులు, బలం మందులు , ఎరువులు కూడా ఆదా అవుతాయి. ముఖ్యంగా వ్యవసాయ ఖర్చును తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన పథకాలను తీసుకొచ్చింది.  ఇందులో భాగంగానే డ్రోన్ లో కొనుగోలుపై రైతులకు సబ్సిడీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చిన్న, సన్నకారు , మహిళా రైతులు,  రైతులకు డ్రోన్ ధరలపై  50 శాతం చొప్పున గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇతర రైతులకు డ్రోన్ల కొనుగోలుకు 40 శాతం లేదా గరిష్టంగా రూ.4లక్షల వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రైతుల ఆర్థిక కష్టాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు అంగీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: