మనీ: రూ.60 పొదుపు తో రూ.13 లక్షల ఆదాయం..!

Divya
ఎల్ఐసి.. దేశంలోనే దిగ్గజ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయినటువంటి అతిపెద్ద జీవిత బీమా సంస్థ అని చెప్పవచ్చు. ముఖ్యంగా అన్ని వర్గాల వారికి పాలసీలను రూపొందిస్తూ వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈరోజు జీవన్ లక్ష్య పాలసీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్ఐసి అత్యంత ప్రజాదారణ పొందిన ప్లాన్లలో ఒకటి. ముఖ్యంగా ఈ పాలసీ కస్టమర్ కి రక్షణతో పాటు పొదుపును కూడా అందిస్తుంది. జీవన లక్ష అనేది పరిమిత ప్రీమియం చెల్లింపు ప్లాన్ అని గుర్తించుకోవాలి. ఇక దీని కింద సబ్స్క్రైబ్ పాలసీ వ్యవధి కంటే మూడు సంవత్సరలు తక్కువగానే ప్రీమియంను చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది.

ఇక ఎల్ఐసి జీవన్ లక్ష్య పాలసీ అనేది విత్ ప్రాఫిట్ పాలసీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎల్ఐసి తన వ్యాపార లాభాలను వినియోగదారులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.. ముఖ్యంగా ఈ ప్లాన్ యొక్క లక్ష్యం ఏమిటంటే పాలసీ చేసిన వ్యక్తి ప్రపంచాన్ని విడిచిపెట్టినట్లయితే నామినీకి సంబంధించిన అన్ని ప్రీమియంలను మాఫీ అవుతాయి.  మొత్తంలో 10% నామినీకి సాధారణ వార్షిక ఆదాయంగా చెల్లించడమే కాకుండా మెచ్యూరిటీ సమయంలో సేకరించిన డబ్బును కూడా అందివ్వడం జరుగుతుంది. ఇక ఈ పాలసీని కన్యాదాన్ పాలసీ అని కూడా పిలుస్తూ ఉంటారు.

ఉదాహరణకు 30 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి రూ.5 లక్షల విలువైన జీవన్ లక్ష్య పాలసీని తీసుకున్నట్లయితే 25 సంవత్సరాల పాలసీ పీరియడ్ ను  ఎంచుకోవాలి. ఇప్పుడు 22 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఇక ప్రతి నెల రూ.1,770 రూపాయలు.. అంటే ప్రతిరోజు 60 రూపాయల చొప్పున 22 సంవత్సరాలు చెల్లించాలి. ఇలా చేస్తే పాలసీ సమయానికి రూ.4,57,772 డిపాజిట్ చేయవలసి వస్తుంది. ఇక పాలసీ 25 సంవత్సరాలు ముగిసేసరికి  .. సమ్ అస్యూర్డ్, రివర్షనరీ బోనస్ తో పాటు అదనపు బోనస్ కూడా పొందుతారు. ఇక మొత్తంగా రూ.6.125 లక్షల వెస్టేడ్ రివర్షనరీ బోనస్ పొందే అవకాశం ఉంటుంది. ఇక మొత్తం కలుపుకున్నట్లయితే సుమారుగా 13.37 లక్షల రూపాయలు మీ చేతికి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: