మనీ: రూ.125 రోజూ వారీ ఆదాతో రూ. 27 లక్షలు మీ సొంతం..!!

Divya
మీలో ఎవరైనా సరే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఇప్పుడు ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టే సమయం వచ్చింది. ఎందుకంటే దేశంలో దిగ్గజ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్తగా ఒక పాలసీని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆడపిల్లలను కన్న తల్లిదండ్రుల కోసం పూర్తి భరోసానిస్తూ ఈ పథకాన్ని తీసుకురావడం గమనార్హం. ముఖ్యంగా మీ పిల్లల చదువు మొదలు వారి వివాహం వరకు ప్రతి విషయంలో కూడా ఆందోళనలు పడకుండా ఎల్ఐసి అందిస్తున్న ఈ స్కీం ద్వారా మరింత సంతోషాన్ని పొందవచ్చు. ఇక ఎల్ఐసి అందిస్తున్న జీవన్ లక్ష్య పథకంలో ప్రతిరోజు మీరు 125 రూపాయలు చొప్పున డిపాజిట్ చేస్తూ పోతే ఏకంగా 27 లక్షల రూపాయలను మీరు పొందవచ్చు

ఇక ఈ ప్లాన్ 25 సంవత్సరాల కాలవ్యవధిని కలిగి ఉంటుంది. కానీ ఇందులో మీరు కేవలం 22 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. కాబట్టి పాలసీ నీ 13 నుంచి 25 సంవత్సరాల మధ్యలోపు ఉండేటట్టు తీసుకోవాలి. ఇక ఈ పథకం కింద ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఒకవేళ మరణిస్తే కుటుంబం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా అదే సమయంలోనే పాలసీ మిగిలిన సంవత్సరాలలో ప్రతి సంవత్సరం బీమా మొత్తంలో 10 శాతం కుమార్తెకు లభిస్తుంది.ఇందుకోసం కనీస వయసు 18 సంవత్సరాలు ఉండగా గరిష్టంగా 50 సంవత్సరాలు ఉండవచ్చు . 65 సంవత్సరాలు గరిష్ట పరిమితి కాబట్టి ఇందులో డెత్ అండ్ యాక్సిడెంట్,  న్యూ టర్మ్ అస్యూరెన్స్ రైడర్లను కూడా పొందవచ్చు.
ఇకపోతే సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది . సెక్షన్ 10 డి కింద కూడా మెచ్యూరిటీ సొమ్ము మొత్తం పన్ను లేకుండా పొందవచ్చు. ఉదాహరణకు 30 సంవత్సరాల వయసులో 10 లక్షల హామీ మొత్తాన్ని తీసుకుంటే దానికోసం మీరు ప్రతి నెల రూ.3,800 అంటే ప్రతిరోజు 125 రూపాయలను ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలి. ఇక 25 సంవత్సరాల తర్వాత మీరు 27 లక్షల రూపాయలను పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: