మనీ: పోస్ట్ ఆఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్.. రూ.3,300 పెన్షన్..!!

Divya
భవిష్యత్తులో ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెడుతున్న పథకాలలో  చేరడం ఉత్తమమైన పని అని చెప్పవచ్చు. ఇకపోతే పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న మంత్లీ ఇన్కమ్ స్కీం లో మీరు ఒకసారి డబ్బులు జమ చేశారు అంటే చాలు ఆ తర్వాత ప్రతి నెల మీకు 3, 300 పెన్షన్ తోపాటు వడ్డీ కూడా లభిస్తుంది. అంతేకాదు ఈ సూపర్ హిట్ స్కీమ్ ద్వారా ఐదేళ్ళ తరువాత మీ డబ్బు మీరు వెనక్కి తిరిగి తీసుకోవచ్చు కూడా.. పోస్టాఫీసు స్కీములు అంటేనే సెక్యూరిటీ ఉంటుందని ప్రతి ఒక్కరి నమ్మకం.అందుకే పోస్టల్ శాఖ కూడా తమ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న మంత్లీ ఇన్కమ్ స్కీం గురించి మనం ఒకసారి పూర్తిగా చదివి తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ స్కీమ్ లో ఒకసారి డబ్బులు జమ చేసి ఆ తర్వాత నెల నెలా వడ్డీ ని పెన్షన్ రూపంలో పొందవచ్చు. సమయం పూర్తయిన తర్వాత డబ్బులు వాపస్ అందుకోవచ్చు. ఇకపోతే పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ పథకం ద్వారా మీరు వెయ్యి లేదా వంద రూపాయల చొప్పున డబ్బులను జమ చేయాలి. ఇందులో అత్యధికంగా రూ.4 లక్షల వరకు డబ్బులు జమ చేయవచ్చు. ఒకవేళ మైనర్ అయితే తల్లి లేదా తండ్రి పేరిట ఈ పథకాన్ని ఓపెన్ చేయవచ్చు. ఈ పథకం ద్వారా 6.6 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. ఈ పథకం ద్వారా మంత్లీ వడ్డీ క్లైమ్ చేయకపోతే దానిపై కూడా అదనపు వడ్డీ లభించే అవకాశం ఉంటుంది.
ఇక ఈ స్కీం యొక్క మెచ్యూరిటీ సమయంలో ఐదు సంవత్సరాలు అకౌంట్ ఓపెన్ చేసిన  ఏడాది వరకు ఇందులో నుంచి డబ్బులు తీయకూడదు. ఒకవేళ మీరు మూడు సంవత్సరాలలో క్లోజ్ చేయాలనుకుంటే మీ అసలు డబ్బులు నుంచి 2 శాతం కట్ అవుతుంది అని గుర్తించాలి. మంత్లీ ఇన్కమ్ స్కీం లెక్కల ప్రకారం ఒకేసారి 50 వేల రూపాయలు జమ చేస్తే ప్రతి నెల 275 రూపాయల చొప్పున ఏడాదికి మూడు వేల మూడు వందల రూపాయలు ఐదు సంవత్సరాల పాటు సొంతం చేసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే రూ.50వేలకి ఐదు సంవత్సరాలకు గాను 16 వేల ఐదు వందలు రూపాయలు వడ్డీ  లభిస్తుంది. ఒకవేళ లక్ష రూపాయలు పెడితే నెలకు ఐదు వందల యాభై రూపాయలు సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: