మనీ: పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చొనే ఈ పథకంలో చేరవచ్చు..!!

Divya
వినియోగదారులకు పోస్ట్ ఆఫీస్ తాజాగా ఒక గొప్ప సౌకర్యాన్ని అందిస్తోంది. మనం పోస్ట్ ఆఫీస్ కు వెళ్లకుండానే ఒక నేషనల్ పెన్షన్ స్కీమ్ లో చేరే సదుపాయాన్ని కూడా మనకు అందిస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనే వాటిని పోస్టల్ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పెన్షన్ భారత స్వచ్ఛంద పథకం వంటిది. ఇది పెన్షన్ యొక్క ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధారంగా నిర్వహిస్తున్నారు. దీనిని 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయస్సు గల ఇండియన్ పౌరులు ఈ స్కీం లో చేరవచ్చు.

ఈ స్కీమును పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్సైట్లో ఈ పథకం చేర్చడం జరిగింది. Nps ఆన్లైన్ కింద తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. Sip వంటి సౌకర్యాలను ఎంపిక చేసుకోవడానికి కనీస చార్జీలతో పాటుగా ఈ పథకాన్ని అందుబాటులో ఉంచింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తన NPS సర్వీస్ ఛార్జ్ చాలా తక్కువ అని తెలియజేసింది. ఇది రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు పెన్షన్ వచ్చే పథకం అని కూడా తెలియజేసింది. NPS నిబంధనల ప్రకారం ఎవరైనా సరే 60 ఏళ్లు వచ్చే వరకు లేదంటే రిటైర్మెంట్ తర్వాత నే ఇందులో డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు.
కానీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఈ పెన్షన్ పథకం నుండి .. డబ్బుని పొందగలిగే పరిస్థితులు కూడా ఉన్నాయని తెలియజేశారు. NPS లో ఒక ఏడాదికి కనీసం రూ.1000 జమ చేయాలి. ఇందులో టైర్ -1, టైర్ -2 అనే రెండు రకాల ఖాతాలు కూడా ఉంటాయట. టైర్ -1 అనేది పూర్తిగా రిటైర్మెంట్ ఖాతా.. ఇందులో రిటైర్డ్ అయిన తర్వాతనే డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. టైర్ -2 ఖాతా ఇందులో మనం ఎప్పుడైనా విత్డ్రా చేసుకునే సదుపాయం కలదు. ఈ ఖాతా ఓపెన్ చేయడానికి మొబైల్ నెంబర్, నెట్వర్క్ బ్యాంకింగ్ ఐడి, యాక్సిస్ బ్యాంకు ఖాతా ఉండాలి. దీనిని ఆన్లైన్ లోనే ఈ పథకంలో చేరవచ్చు. అయితే వీటికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఎన్ పీ ఎస్ లాగిన్ వ్యవధి కాలం 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: