మనీ: డ్వాక్రా మహిళ సంఘాలకు షాక్..!!

Divya
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా సంఘాలకు దిగ్గజ ఎల్ఐసి సంస్థ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం పథకం తో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలుపుతూ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా మహిళా సంఘాలు షాక్ కి గురి అవుతున్నాయి. ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటూ ఎల్ఐసి బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల కోసం అభయహస్తం పథకంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే..ఈ అభయహస్తం పథకం కింద ఎల్ఐసి లో రూ.రెండు వేల కోట్లను డిపాజిట్ చేసింది .కానీ ఏమైందో తెలియదు కానీ తాజాగా.. తమ వద్ద ఉన్న రూ. 2 వేల కోట్ల నిధిని ఏపీ ప్రభుత్వం విత్ డ్రా చేసుకోవడంతో తమ ఒప్పందం రద్దయిందని ఎల్ఐసి ప్రకటించడం గమనార్హం.

2021 నవంబర్ 3న ఈ ఒప్పందం రద్దయిందని ఎల్. ఐ.సీ ప్రకటించింది. 2009 సంవత్సరం నవంబర్ లో అభయహస్తం పథకం కోసం ఎల్. ఐ. సీ గ్రామీణ పేదరిక సంస్థతో  అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఎవరైతే స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారు ఈ అభయహస్తం పథకంలో వారి వాటా చెల్లించడం ద్వారా మహిళలకు 60 ఏళ్లు నిండిన తర్వాత ఎల్.ఐ.సీ పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు. ఇక వైయస్ రాజశేఖరరెడ్డి రెండోసారి సీఎం అయిన తర్వాత డ్వాక్రా మహిళల కోసం 2009లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇక 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు ఈ స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ. 365 చెల్లిస్తే.. అంతే మొత్తాన్ని ఆ మహిళల పేరిట రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది.

ఇలా క్రమం తప్పకుండా  వారు చెల్లించిన రోజు నుంచి ప్రభుత్వం కూడా చెల్లిస్తూ.. వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెల రూ. 500 నుంచి రూ. 3 వేల వరకు పెన్షన్ అందించాలనేదే ఈ పథకం ఉద్దేశం. కానీ ఎల్ఐసి లో ఉన్న మొత్తం 2 వేల కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. ఇక తమ వద్ద ఉన్న అన్ని నిధులను అభయహస్తం నోడల్ ఏజెన్సీ ఎస్ఈఆర్సీకి బదిలీ చేశారు.. అభయహస్తం పథకం కింద అన్ని కర్తవ్యాలు, బాధ్యతల నుంచి మేము వైదొలిగామని తెలిపింది. అందుకే డ్వాక్రా సంఘాలకు మాకు ఎటువంటి సంబంధం లేదని ఐసీసీ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: