మనీ : పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ.. అదిరిపోయే డబ్బు సంపాదించే మార్గాలు..

Divya

డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం కొన్ని  ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో పలు రకాలుగా వ్యాపారాలు చేయవచ్చు. అలాగే తక్కువ ఖర్చుతో మంచి రాబడిని కూడా పొందవచ్చు. అయితే ఆ వ్యాపారాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఫ్లవర్ బిజినెస్:
ఏదైనా  కార్యక్రమాలకు పూలను డెలివరీ చేయవచ్చు. లేదంటే పెళ్లిళ్లకు  కూడా పూలను డెలివరీ చేయవచ్చు. అంతేకాకుండా ఆన్లైన్లో కూడా పూల కోసం ఆర్డర్లు తీసుకోవచ్చు. వీటిని డెలివరీ చేయవచ్చు.
టేకు చెట్ల పెంపకం:
మీకు గనుక పొలం ఉంటే, టేకు అలాగే ఎర్రకలప వంటి మొక్కలను నాటి, మంచి రాబడిని పొందవచ్చు ఎనిమిది నుంచి పది సంవత్సరాలలో ఈ చెట్ల నుంచి మంచి రాబడి వస్తుంది. ఒక ఎర్ర కలప చెట్టు కు 40 వేల రూపాయల వరకు వస్తే, టేకు చెట్లకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి.
పాల వ్యాపారం:
ఒక ఆవు లేదా గేదె ను కొనుగోలు చేసి, వీటి ద్వారా పాల వ్యాపారం చేయవచ్చు. ప్రస్తుతం లీటరు పాల ధర 60 నుంచి 70 రూపాయలు పలుకుతోంది కాబట్టి మంచి ఆదాయం లభిస్తుంది.
తేనె వ్యాపారం:
ఈ వ్యాపారం కోసం కేంద్రం నుంచి కూడా ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు. ఇది కూడా ఒక మంచి రాబడి నిచ్చే బిజినెస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ వ్యాపారం పెట్టడం కోసం రూ.లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది.
కోళ్ల పెంపకం:
కోళ్ల వ్యాపారం ద్వారా కూడా మంచి రాబడిని పొందవచ్చు. అంటే ఇందులో ముద్ర లోన్ తీసుకొని పౌల్ట్రీ బిజినెస్ ప్రారంభించవచ్చు.
పుట్టగొడుగుల వ్యాపారం:
ఇటీవల కాలంలో ఈ పుట్టగొడుగులకు మంచి డిమాండ్ పెరిగింది. కాబట్టి వీటిని పెంచడం వల్ల తక్కువ ఖర్చు అవుతుంది. అలాగే ప్రతి నెలా 50 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.
అలోవెరా:
అలోవేరా మొక్కల పెంపకం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అలోవెరాను  ఎక్కువగా మెడిసిన్, కాస్మెటిక్స్ వంటి వాటి తయారీలో ఉపయోగిస్తున్నారు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే బెస్ట్ వ్యాపారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: